Share News

YS Jagan: భయపడ్డారా.. కాంగ్రెస్‌తో దోస్తీ కోసమేనా రాజీ..

ABN , Publish Date - Oct 21 , 2024 | 10:24 AM

అధికారం కోల్పోయిన తర్వాత.. వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలంటూ ఎంతో మంది సొంత పార్టీ నాయకులే హితవు పలికారు. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహారించాలని, సోదరి షర్మిలతో వివాదం మంచిదికాదని.. ఎన్నికలకు ముందు జగన్‌కు సన్నిహితులు చెప్పినా.. ఆయన మాత్రం ససేమిరా అన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత..

YS Jagan: భయపడ్డారా.. కాంగ్రెస్‌తో దోస్తీ కోసమేనా రాజీ..
YS Jagan

వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకున్నారా.. మొండి తనాన్ని వీడారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీఎంగా ఉన్న సమయంలో తనను తాను ఎక్కువుగా ఊహించుకున్న జగన్.. అధికారం కోల్పోయిన తర్వాత.. వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలంటూ ఎంతో మంది సొంత పార్టీ నాయకులే హితవు పలికారు. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహారించాలని, సోదరి షర్మిలతో వివాదం మంచిదికాదని.. ఎన్నికలకు ముందు జగన్‌కు సన్నిహితులు చెప్పినా.. ఆయన మాత్రం ససేమిరా అన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారినట్లు కనిపిస్తోంది. తనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే అందరినీ కలుపుకుని వెళ్లాలనే ఆలోచనకు వచ్చారా.. లేదంటే తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకడుగు వెనక్కి వేశారో ఏమిటో కాని.. తన ఆస్తిలో చెల్లి షర్మిలకు నయా పైసా ఇచ్చేది లేదంటూ భీష్మించుకు కూర్చున్న.. జగన్ ప్రస్తుతం ఆస్తి పంపకాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బెంగళూరు వేదికపై ఈ చర్చలు జరిగినట్లు సమాచారం. సింగింల్‌గా ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని గ్రహించిన జగన్.. తన పార్టీ రాజకీయ భవిష్యత్తు కోసం రాబోయే కాలంలో కాంగ్రెస్‌తో దోస్తి కట్టాలనే ఆలోచనలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఏపీ పీసీసీ చీఫ్‌గా తన చెల్లి షర్మిల ఉండటంతో.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్‌ను షర్మిల పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో నెలకొన్న వివాదమే దీనికి కారణమనే ప్రచారం జరిగింది. ఆస్తి పంపకాలకు జగన్ సానుకూలంగా స్పందించడంతో వైసీపీ కాంగ్రెస్‌తో జతకట్టేందుకు షర్మిల ప్రస్తుతం అభ్యంతరం చెప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది.


సింగిల్‌గా వెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు చూస్తే.. కాంగ్రెస్, వైసీపీ ఒంటరిగా ఎదగడం కష్టమనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌తో కలిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందదనే ఆలోచనలో జగన్ ఉండగా.. వైసీపీతో జట్టుకడితే ఏపీలో మళ్లీ బలపడటానికి అవకాశం ఉంటుందనే అంచనాలతో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో కలవాలంటే షర్మిలతో పంచాయితీ తెంచుకోవాలని అధిష్టానం పెద్దలు చెప్పడంతోనే ఆస్తుల పంపంకంపై జగన్ ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.


భయపడ్డారా..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు సింహం సింగిల్‌గా వస్తుందన్న డైలాగ్‌ను ఊదరగొట్టిన జగన్ అండ్ కో.. ఎన్నికల ఫలితాల తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏదో ఒక జాతీయ పార్టీతో జట్టుకడితేనే తమకు రాజకీయంగా మనుగడ ఉంటుందనే భావనకు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ప్రజల తీర్పు చూసిన తర్వాత జగన్ కొంత భయపడ్డారని, పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇటీవల హర్యానా ఎన్నికల ఫలితాల వేళ ఈవీఎంలపై కాంగ్రెస్ విమర్శలు చేయగా.. హస్తం నేతలతో జగన్ సైతం గొంతు కలిపారు. ఇవ్వన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్‌తో వైసీపీ జట్టు కడుతుందనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 21 , 2024 | 10:39 AM