Heavy Rains: ప్రజలకు అలర్ట్.. వచ్చే 3 రోజులు వర్షాలు
ABN , Publish Date - Dec 16 , 2024 | 06:30 PM
గత కొన్ని రోజులుగా వర్షాలకు బ్రేక్ ఇచ్చిన వరణుడు ఇప్పుడు మళ్లీ ఎటాక్ చేస్తున్నాడు. తమిళనాడులో ఇప్పటికే వర్షాలు దంచికోడుతుండగా, వచ్చే మూడు రోజులు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. ఎక్కడెక్కడనేది ఇక్కడ చూద్దాం.
ఏపీ (Andhra Pradesh) ప్రజలకు అలర్ట్. ఎందుకంటే మళ్లీ వర్షాలు (rains) రాబోతున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే మూడు రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు రానుండగా, ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. దీంతోపాటు రేపు తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. చేపల వేటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.
భారీ వర్షాలు
అల్పపీడనం రెండు రోజుల్లో మరింత బలపడుతుందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. దీంతో రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురియనున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దీంతోపాటు నీటి ఎద్దడి ఒకే చోట ఉండకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలో వర్షపాత విభాగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వర్షం సూచనలకు అనుగుణంగా సమాచారాన్ని అందిస్తోంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే
కానీ దీనికి భిన్నంగా తెలంగాణ వాతావరణ శాఖ ఈరోజు, రేపు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఇది డిసెంబర్ 17న ప్రారంభమై, డిసెంబర్ 20 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. అయినప్పటికీ తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ ఉదయం వేళల్లో వివిధ జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శీతల గాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉన్నందున ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల వాసులు వాతావరణ అప్‌డేట్ గురించి తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక్కడ కూడా మరో 3 రోజులు
ఈ అల్పపీడనం కారణంగా తమిళనాడులో కూడా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెన్నైలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ అసెంబ్లీ.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
Read Latest AP News And Telugu News