Share News

AP Rains: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ABN , Publish Date - May 10 , 2024 | 09:57 PM

ఈ వేసవిలో భానుడి తాపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 14వ తేదీ వరకు తేలికపాటి..

AP Rains: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఈ వేసవిలో (Summer) భానుడి తాపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఏపీ (AP Rains) ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. అంతేకాదు.. పలు ప్రాంతాల్లో పిడుగులు (Thunder Storms) పడొచ్చని, కాబట్టి ఆయా ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. కనిష్టంగా ఉష్ణోగ్రత 24 డిగ్రీల వరకు ఉండొచ్చని తెలిపింది.


శనివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని.. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలు వర్షం పడే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చింది. కాగా.. ఇదివరకే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇప్పుడు మళ్లీ వర్షాలు పడే సూచనలు ఉండటంతో.. ఏపీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాతావరణ మార్పుతో భగభగమండే ఎండల నుంచి ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు.

Updated Date - May 10 , 2024 | 11:03 PM