Heritage: ఆ డాక్యుమెంట్స్ అత్యంత ప్రాధాన్యమైనవి.. సీఐడీకి హెరిటేజ్ కంపెనీ సెక్రటరీ లేఖ
ABN , Publish Date - Apr 08 , 2024 | 05:19 PM
Andhrapradesh: తాడేపల్లి సిట్ కార్యాలయంలో హెరిటేజ్ పత్రాలు దగ్ధంపై మీడియాలో వచ్చిన కథనాలపై హెరిటేజ్ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత్ బారిక్ స్పందించారు. ఈ ఘటను సంబంధించి సీఐడీ అడిషనల్ ఎస్పీకి ఉమాకాంత్ లేఖ రాశారు. సీఐడీ కస్టడీలో ఉన్న తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్ పుస్తకాలను తాము అధికారుల కోరిక మేరకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
అమరావతి, ఏప్రిల్ 8: తాడేపల్లి సిట్ కార్యాలయంలో హెరిటేజ్ పత్రాలు (Heritage Documents) దగ్ధంపై మీడియాలో వచ్చిన కథనాలపై హెరిటేజ్ కంపెనీ సెక్రటరీ ఉమా కాంత్ బారిక్ (Heritage Company Secretary Uma Kant Barik) స్పందించారు. ఈ ఘటను సంబంధించి సీఐడీ అడిషనల్ ఎస్పీకి (CID Additional SP) ఉమాకాంత్ లేఖ రాశారు. సీఐడీ (CID) కస్టడీలో ఉన్న తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్ పుస్తకాలను తాము అధికారుల కోరిక మేరకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. హెరిటేజ్‌కు సంబంధించిన పత్రాలను దగ్ధం చేసినట్లు సోషల్ మీడియా, టీవీ వార్తల్లో వచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ తాము ఇచ్చిన డాక్యుమెంట్లు చాలా కీలకమైనవని పేర్కొన్నారు. తాము దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరించడమే కాకుండా న్యాయబద్ధులై ఉంటామని, ఇదే సమయంలో డాక్యుమెంట్ల భద్రత కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశమన్నారు.
CID: ‘అవి హెరిటేజ్ డాక్యుమెంట్లు కావు’.. సీఐడీ దిద్దుబాటు చర్యలు
మీడియాలో వచ్చిన కథనాలు సీఐడీ కస్టడీలో ఉన్న తమ డాక్యుమెంట్ల భద్రతను ప్రశ్నార్ధకం చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై తమకు పూర్తిస్థాయి పరిస్థితిని వివరించాలని దర్యాప్తులో పారదర్శకత, నిబద్ధత, న్యాయ ప్రక్రియలో ప్రజా విశ్వాసాన్ని పొందుతాయన్నారు. ఈ డాక్యుమెంట్లు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవని వివరించారు. దీనిపై తమకు పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని సీఐడీకి హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత్ బారిక్ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
AP Politics: వారు వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు: దస్తగిరి
PM Modi: అమెరికాలో ఎన్ఆర్ఐల ప్రచారం.. మూడోసారి మోదీ ప్రధాని కావాలని నినాదాలు
మరిన్ని ఏపీ వార్తల కోసం...