YSRCP: వైసీపీలో చేరిన ఐఏఎస్ ఇంతియాజ్.. పోటీ ఇక్కడ్నుంచేనా..?
ABN , Publish Date - Feb 29 , 2024 | 01:15 PM
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎండి. ఇంతియాజ్ చేరారు. తాజాగా ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయం (CM Camp Office)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎండి. ఇంతియాజ్ (Imtiaz) చేరారు. తాజాగా ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బి.వై.రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా.. కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును సీఎం జగన్ పరిశీలిస్తున్నారు. ముఖ్యనేతలు, ఎమ్మెల్యే, జిల్లా నేతలతో ఆయన అభ్యర్థిత్వంపై జగన్ చర్చిస్తున్నారు. దాదాపు అభ్యర్థిగా ఇంతియాజ్ ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తోంది. దీంతో ఇంతియాజ్‌కు జగన్ నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇంతియాజ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి నేడు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి వైసీపీ కండువా కప్పుకున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.