Share News

AP Elections: సిట్ తుది నివేదికలో నిర్ఘాంతపోయే విషయాలు...

ABN , Publish Date - Jun 10 , 2024 | 09:26 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ(AP Assembly) ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు కోసం సిట్‌(SIT)ను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ సిట్ తుది నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. తుది నివేదికలో నిర్ఘాంతపోయే కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

AP Elections:  సిట్ తుది నివేదికలో నిర్ఘాంతపోయే విషయాలు...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ(AP Assembly) ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు కోసం సిట్‌(SIT)ను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ సిట్ తుది నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. తుది నివేదికలో నిర్ఘాంతపోయే కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.


సిట్ నివేదికలోని కీలక అంశాలు..

సార్వత్రిక ఎన్నికల సమయంలో హింసకు సంబంధించి సిబ్ బృందం కీలక అంశాలు గుర్తించింది. పోలింగ్ రోజు తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల బైక్ ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇరువర్గాల అనుచరులు పెద్దసంఖ్యలో పాల్గొనడంతో పెద్దఎత్తున హింస చెలరేగింది. ఇది సెక్షన్ 144కు విఘాతం కలిగించడమే అని సిట్ రిపోర్టులో పేర్కొంది. తిరుపతి, పల్నాడు జిల్లాల్లో రాజకీయ నాయకుల వాహనాలు, ఆస్తులతోపాటు సామాన్యుల ఆస్తులూ విధ్వంసానికి గురయ్యాయి. పోలీసు వాహనాలను సైతం అల్లరి మూకలు దగ్ధం చేశారు. తద్వారా ప్రజల్లో భయం, అభద్రతా భావం కలిగించే ప్రయత్నం జరిగిందని సిట్ తెలిపింది.


పల్నాడు జిల్లాలో కేసులు నమోదు నుంచి విచారణ వరకూ పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదని, నిందితులను సరిగా ప్రశ్నించకపోవడం, వారిపై నమోదు చేయాల్సిన సెక్షన్‌లు సరిగా పెట్టకపోవడం హింస కొనసాగింపునకు కారణమైదని తెలిపింది. ఈ కేసుల్లో చాలావరకూ నిందితులను అగంతకులుగా చూపారని, తెలిసిన వారినీ నేటి వరకు అరెస్టు చేయలేదని రిపోర్టులో వెల్లడించింది. వీటిలో కొన్ని సంఘటనలు పట్టపగలు, నివాసిత ప్రాంతాల్లో జరిగినా సాక్షులను ప్రశ్నించి ఆధారాలు సేకరించడం జరగలేదంది.


ఈవీఎంల ధ్వంసం కేసుల్లో నిందితులు కనిపిస్తున్నా.. వారిని గుర్తుతెలియని వ్యక్తులుగా చూపారని వెల్లడించింది. ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని.. దాన్ని వెంటనే ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపి నిర్ధారించుకోవాలని తెలిపింది.

పోలింగ్ భూతుల్లో ఈవీఎంలు ధ్వంసం జరిగితే వీఆర్వో, బీఎల్వోలు ఫిర్యాదు ఆలస్యంగా ఇచ్చారని, నిజానికి ఫిర్యాదు చేయాల్సిన ప్రిసైడింగ్ ఆఫీసర్ మరింత ఆలస్యం చేశారని పేర్కొంది. గాయపడిన వారి మెడికల్ రిపోర్టులు ఇంతవరకూ కలెక్ట్ చేయకపోవడంతో కేసు బలహీనపడే అవకాశం ఉందని సిట్ తన తుది నివేదికలో పేర్కొంది.

For more Andhra Pradesh News and Telugu News Click here..

Updated Date - Jun 10 , 2024 | 09:47 PM