YSRCP: బాబోయ్.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న వైసీపీ అరాచకాలు..!
ABN , Publish Date - Dec 12 , 2024 | 11:50 AM
వైసీపీ నాయకుల ఒత్తిడితో మండలంలో అధికారులు ఇష్టారాజ్యంగా సదరం సర్టిఫికెట్లు జారీ చేశారు. దీంతో గత టీడిపీ పాలనలో 400 ఉన్న దివ్యాంగుల పింఛన్ల సంఖ్య 1200కి పెరిగింది. ఇందులో అనర్హుల సంఖ్య చాలా ఎక్కువ..
మావాన్ని పంపిస్తున్నా..
సదరం సర్టిఫికెట్ ఇచ్చెయ్
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యం శింగనమల
అనర్హులకు పింఛన్లు..
వాటిని ఏరివేయాలని మొదలైన డిమాండ్లు
అర్హత లేకున్నా పింఛను పొందుతున్న లబ్ధిదారులు
శింగనమల, డిసెంబరు 12: వైసీపీ నాయకుల ఒత్తిడితో మండలంలో అధికారులు ఇష్టారాజ్యంగా సదరం సర్టిఫికెట్లు జారీ చేశారు. దీంతో గత టీడిపీ పాలనలో 400 ఉన్న దివ్యాంగుల పింఛన్ల సంఖ్య 1200కి పెరిగింది. ఇందులో అనర్హుల సంఖ్య చాలా ఎక్కువ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సదరం సర్టిఫికెట్లు ఇప్పించడంలో వైసీపీ నాయకులతో పాటు వలంటీర్లు కీలకంగా పని చేశారు. ప్రస్తుతం అధికారం మారిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పింఛన్ల తనిఖీ చేపట్టి అనర్హులను ఏరివేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. మండలంలో 6,564 వివిధ రకాల పింఛన్లు ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్ల 3505, దివ్యాంగుల పింఛన్ల 1271, వితంతు పింఛన్ల 1188 తోపాటు ఇతర పింఛన్లు ఉన్నాయి. అయితే గత టీడీపీ హయాంలో 400 పైగా ఉన్న దివ్యాంగులు పింఛన్లు ఐదేళ్ల వైసీపీ పాలనలో 1271కి పెరిగాయి.
వైసీపీ పాలనలో కొందరు నాయకులు సదరం సర్టిఫికెట్ ఇచ్చే అధికారులకు ఫోన్ చేసి ‘నీ రెటెంతో చెప్పు. మా వాళ్ళు వస్తారు. వారికి పింఛన్లకు అవసరమైన 40 శాతం దివ్యాంగత్వం ఉన్నట్లు సర్టిఫికెట్లు ఇవ్వండి’ అని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నాయకులు, వలంటీర్లు కొందరు తమ బంధువులకు సదరం సర్టిఫికెట్ ఇప్పించుకుని దివ్యాంగుల పింఛన్ పొందుతున్నారు. ప్రస్తుతం వీరికి నెలకు రూ.6 వేల పింఛన్ లభిస్తోంది. అనర్హులు ఇలా పింఛన్ పొందుతుండటంతో ప్రభుత్వ ధనం వృథా అవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనర్హులను ఏరివేయాలని కోరుతున్నారు. మండలంలో కొన్ని అనర్హుల ఫించన్లు పరిశీలిస్తే.. వెస్ట్ నరసాపురం సచివాలయంలో ఐడీ నెంబర్లు 11200161312, 11200140119, 11200190030, 11200156825, 11200067006, 11002001332644, 112977099, 112002 07862, 1121124587, 112905318, 11200035417, 1120020060 4, 1120019 0900, 11200084091, 112001 85186, నాయనవారిపల్లిలో 11200137545, 1120013 7547, 11200176385, 11200188 433, 11200190517, 11200205137, సలకంచెరు వులో 11200004143, 11200070912, 11200085988, 11200098200, 11200098 202, 11200126913, 11200158984, 11200198367 లు అర్హత లేకపోయినా పింఛన్లు పొందుతున్నారు. ఇలా మండలంలో చాలా గ్రామాల్లో అర్హతలేని వారు పింఛన్లు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారు సుమారు 600 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.
సర్టిఫికెట్ కావాలంటే రూ.వేలు చెల్లించాల్సిందే..!
వైసీపీ పాలనలో అర్హత లేనివారికి సైతం సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తామని చెప్పి కొందరు నాయకులు, వలంటీర్లు రూ.20 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ సొమ్ము పెరగడంతో ఇప్పటి నాయకులు రూ.35 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. శింగనమల ఆసుపత్రిలో గతంలో సదరం క్యాంపు డాక్టర్‌గా పని చేసిన మెడికల్ ఆఫీసర్ కొందరు వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఇష్టారాజ్యాంగా సర్టిఫికెట్లు జారీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ డాక్టర్‌పై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఫిర్యాదు చేస్తే విచారిస్తాం..
‘మండలంలో దివ్యాంగుల బోగస్ పింఛన్లపై ఎక్కడా ఫిర్యాదులు రాలేదు. ప్రభుత్వం నుంచి పింఛన్ల తనిఖీలు చేయమని ఆదేశాలు రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నోటిస్ జారీ చేసి వైద్యుల చేత విచారణ చేసి అర్హతలేకపోతే తొలగిస్తాం’
-నిర్మలాకుమారి, ఎంపీడీఓ