Share News

AP Politics: పేర్ని నానికి గుడివాడలో ఘోర అవమానం.. దెబ్బకు బండి తిప్పుకుని..

ABN , Publish Date - Sep 01 , 2024 | 04:54 PM

కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి పేర్ని నానికి ఘోర అవమానం చోటు చేసుకుంది. కొందరు యువకులు పేర్ని నానిపై కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం నాడు పేర్ని నాని గుడివాడలోని..

AP Politics: పేర్ని నానికి గుడివాడలో ఘోర అవమానం.. దెబ్బకు బండి తిప్పుకుని..
Perni Nani

గుడివాడ, సెప్టెంబర్ 1: కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి పేర్ని నానికి ఘోర అవమానం చోటు చేసుకుంది. కొందరు యువకులు పేర్ని నానిపై కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం నాడు పేర్ని నాని గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చారు. ఇది గమనించిన జనసేన కార్యకర్తలు, అభిమానులు.. పేర్ని నానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శివాజీ ఇంటి ముందు ధర్నాకు దిగారు జనసైనికులు.


ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కొందరు యువత.. పేర్ని నానిపై కోడిగుడ్లను విసిరారు. ఉన్నట్లుండి కోడుగుడ్లు మీద పడడంతో షాకైన పేర్ని నాని.. గుడివాడ నుంచి వెనుదిరిగారు. మరికొందరు కారును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అలర్ట్ అయి వారిని అదుపు చేశారు. జనసైనికులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అలర్ట్ అయిన పోలీసులు.. జనసైనికులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. వారిని తరలించే ప్రయత్నం చేయగా.. మిగతా జనసైనికులు పోలీసు వాహనాలకు అడ్డుపడ్డారు. వాహనాలకు అడ్డంగా రోడ్డుపై పడుకున్నారు. దీంతో పోలీసులు, జనసైనికులు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.


ఖబర్దార్ పేర్ని నాని..

కాగా, జనసైనికులు మాట్లాడుతూ.. పేర్నినానిపై షాకింగ్ కామెంట్స్. ఖబర్దార్ పేర్ని నాని అంటూ.... చెప్పులు తీసి హెచ్చరించారు జనసైనికులు. క్షమాపణ చెప్పకుండా గుడివాడ నుంచి వెళ్ళనిచ్చే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మహిళలను అవమానపరిచేలా పోస్టులు పెడుతున్న వ్యక్తిని పరామర్శించేందుకు పేర్ని నాని గుడివాడ రావడం దౌర్భాగ్యం గుడివాడ మహిళలు సైతం విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉండగా మహిళలను దారుణంగా అవమానించారని.. ఇప్పుడు అవమానించే వారికి కొమ్ము కాయడం సిగ్గుచేటు అని మండిపడుతున్నారు. రెండు చెప్పులతో పవన్ కళ్యాణ్‌ విమర్శించారని.. ఇప్పుడు 36 చెప్పులు ఉన్నాయన్నారు. ఇప్పుడు పేర్ని నాని వచ్చి తమకు సమాధానం చెప్పాలని గుడివాడ మహిళలు డిమాండ్ చేస్తున్నారు. దమ్ముంటే బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటున్నారు. పేటియం పేర్ని నాని అంటూ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.


Also Read:

రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రజలకు కీలక అలర్ట్

ఈ ఏనుగుకు హెల్పింగ్ నేచర్ ఎక్కువే..

2 షేర్లకు ఒకటి ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ సంస్థ

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 01 , 2024 | 04:54 PM