Share News

AP News: ఆ తండ్రీకొడుకులకు డ్రైవర్, క్లీనర్‌గా ఉద్యోగాలిస్తా.. జనసేన నేత హాట్ కామెంట్స్

ABN , Publish Date - Feb 05 , 2024 | 01:44 PM

Andhrapradesh: మాజీ మంత్రి పేర్నినేని, ఆయన తనయుడు కిట్టుపై జనసేన నేత కొరియర్ శ్రీను తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నంలో జనసేన నాయకుడు కొరియర్ శ్రీను కార్యాలయం ముందు ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించి దగ్ధం చేశారు.

AP News: ఆ తండ్రీకొడుకులకు డ్రైవర్, క్లీనర్‌గా ఉద్యోగాలిస్తా.. జనసేన నేత హాట్ కామెంట్స్

కృష్ణా జిల్లా, ఫిబ్రవరి 5: మాజీ మంత్రి పేర్నినేని (Former Minister Perni Nani) , ఆయన తనయుడు కిట్టుపై జనసేన నేత కొరియర్ శ్రీను (Janasena Leader Courier Srinu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నంలో జనసేన నాయకుడు కొరియర్ శ్రీను కార్యాలయం ముందు ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించి దగ్ధం చేశారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తండ్రీ కొడుకులిద్దరికీ నా లారీపై డ్రైవర్, క్లీనర్ ఉద్యోగాలు ఇస్తా.. పేర్ని నాని, కిట్టులు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి. మీకింకా అధికారం రెండు నెలలే అని గుర్తు పెట్టుకోండి. అధికారం పోయిన తర్వాత తండ్రీ కొడుకులిద్దరికీ నేనే ఉద్యోగం ఇస్తా’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ కార్యకర్తలు కూడా నానిని నమ్మి జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. తండ్రీ కొడుకులు అమాయకులను పంపించి‌ వారి జీవితాలు నాశనం చేస్తున్నారన్నారు. ‘‘నానికి దమ్ముంటే... నీ కొడుకును పంపు. నీ కొడుకు వ్యాపారాలు చేసుకోవాలా. నీ‌ కొడుకు వయసు వాళ్లు ఇలాంటి పనులు చేసి జైలుకెళ్లాలా. ఈ విషయంలో పాత్రధారులు, సూత్రధారులను పోలీసులు అరెస్టు చేయాలి’’ అని జనసేన నేత కొరియర్ శ్రీను డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 05 , 2024 | 01:44 PM