Share News

JC Prabhakar Reddy: మాకు చాలా అన్యాయం జరిగింది.. దొంగలుగా చిత్రీకరించారు

ABN , Publish Date - Jun 19 , 2024 | 12:19 PM

వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని.. తమను దొంగలుగా చిత్రికరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తననూ.. తన కొడుకును జైలుకు పంపారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకే బీఎస్ 4 వాహనాలను కొనుగోలు చేశామని.. బీఎస్4 వాహనాలను అమ్మినవాళ్లదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పింది..

JC Prabhakar Reddy: మాకు చాలా అన్యాయం జరిగింది.. దొంగలుగా చిత్రీకరించారు

అనంతపురం: వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని.. తమను దొంగలుగా చిత్రీకరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) వెల్లడించారు. తననూ.. తన కొడుకును జైలుకు పంపారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకే బీఎస్-4 వాహనాలను కొనుగోలు చేశామని, బీఎస్-4 వాహనాలను అమ్మిన వాళ్లదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పిందన్నారు. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయన్నారు. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న తమపై కేసులు పెట్టి జైలుకు పంపారని వాపోయారు. ఏ తప్పు చేయకపోయినా అర్ధరాత్రి తమను అరెస్టు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.


‘‘రేయ్ నరుకుతా.. ఏం చేస్తారు.. ఈ వర్డ్ వాడకూడదు కానీ వాడతా. ఏపీలో మా దగ్గర ఉన్న రూట్ బస్సులు ఎవరి దగ్గరా లేవు. చిన్నచిన్న కారణాలు చూపి బస్సులు సీజ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదని కూడా సీజ్ చేశారు. డీటీసీ శివప్రసాద్ నీ చిట్టా లాగుతా.. బజారుకు ఈడుస్తా. కక్షతో నా బస్సులను సీజ్ చేశారని హైకోర్ట్‌కి వెళ్లా. వైసీపీ ప్రభుత్వంలో నాకు తీవ్ర అన్యాయం జరిగింది. కమిషనర్, డీటీసీ శివప్రసాద్ ఇళ్ల వద్ద కూర్చుంటా.. బస్సులన్నీ తుప్పుపట్టాయి. రెండు బస్సులను వైసీపీ గుండాలు కాల్చేశారు. నా బస్సులను పట్టుకుని అనవసరంగా సీజ్ చేసిన ప్రతి ఒక్కరినీ కోర్టుకు లాగుతా. నా కొడుకు, కోడలు ఎస్పీ కార్యాలయంలో నేను నా భార్య డీటీసీ ఆఫీస్ వద్ద కూర్చుంటాం’’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు మళ్లీ తగ్గాయోచ్.. కానీ..

కౌరవ సభ స్థానంలో గౌరవ సభ

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 12:30 PM