JD Lakshminarayana: ఏపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ఏకపక్షంగా ఉంది
ABN , Publish Date - Mar 11 , 2024 | 09:06 PM
ఏపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ఏకపక్షంగా ఉందని ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) అన్నారు. తిరుపతి లోక్‌సభ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఏపీ యునైటైడ్ ఫ్రంట్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్(IAS) పోటీ చేస్తారని సోమవారం నాడు ప్రకటించారు.
తిరుపతి: ఏపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ఏకపక్షంగా ఉందని ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) అన్నారు. తిరుపతి లోక్‌సభ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఏపీ యునైటైడ్ ఫ్రంట్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్(IAS) పోటీ చేస్తారని సోమవారం నాడు ప్రకటించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ప్రస్తుతం ఏపీలో యువతకు ఉద్యోగాలు లేవని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. సీఎం జగన్ రెడ్డి (CM Jagan) అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ అమ్మకాలు, దోపిడి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవటంపై ఓటర్లు అభ్యర్థుల నుంచి రాతపూర్వకంగా హామీ తీసుకోవాలని జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు.
ప్రకృతి సంపదను వైసీపీ నేతలు దోపిడి చేస్తున్నారు: విజయ్ కుమార్
ప్రకృతి సంపదను వైసీపీ నేతలు దోపిడి చేస్తున్నారని తిరుపతి లోక్‌సభకు పోటీ చేస్తున్నా లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. ఏపీలో ప్రధాన పార్టీలు ఓట్లకోసం ప్రజలను వేలం వేస్తున్నాయన్నారు. పేదరికాన్ని ఎప్పటికీ ఇలాగే ఉండేలా కుట్రతో పాలన చేశాయని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, రక్షణ, విద్యపై నిధులు ఖర్చు చేయకుండా సంక్షేమం పేరుతో సోమరిపోతులను చేస్తున్నారని ధ్వజమెత్తారు.రాజకీయం తప్ప రాజనీతి లేని నేతలే పాలన చేస్తున్నారని విజయ్ కుమార్ అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి