Share News

K. Rammohan Naidu : దేశంలో మరో 50 కొత్త ఎయిర్‌పోర్టులు

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:45 AM

దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ చెప్పారు.

K. Rammohan Naidu : దేశంలో మరో 50 కొత్త ఎయిర్‌పోర్టులు

  • ఏపీలో అన్ని విమానాశ్రయాల నుంచి నూతన సర్వీసులు: రామ్మోహన్‌

రాజమహేంద్రవరం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ చెప్పారు. ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరానికి తొలి విమాన సర్వీస్‌ గురువారం ఉదయం చేరుకుంది. ఇందులో రామ్మోహన్‌, ఎంపీలు పురందేశ్వరి, ఉదయ్‌ శ్రీనివాస్‌ వచ్చారు. ఈ విమానానికి ఎమ్మెల్యేలు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జ్ఞానేశ్వర్‌ స్వాగతం పలికారు. అనంతరం రామ్మోహన్‌ మాట్లాడుతూ మోదీ ప్రధాని కాకముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 150కు పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, నిర్మాణాల విషయంలో సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారన్నారు. ఢిల్లీకి సర్వీస్‌ ప్రారంభమైందని, త్వరలో తిరుపతి, వారాణసి, అహ్మదాబాద్‌, జైపూర్‌లకు సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. తిరుపతి, షిర్డీ, బెంగుళూరుకు విమాన సర్వీసులు ప్రారంభించాలని ఎంపీ పురందేశ్వరి కోరారు.

Updated Date - Dec 13 , 2024 | 05:46 AM