KA PAUL: ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించొద్దు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 12 , 2024 | 10:37 PM
ఏపీలో ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించి మేలో ఫలితాలిస్తుడటంతో ఈవీఎంలు మిస్ అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA PAUL) అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల అధికారిని కలిశానని.. ఎలక్షన్‌ను ఏప్రిల్‌లో నిర్వహించవద్దని కోరానని తెలిపారు. ఏపీకి ముగ్గురు ఎన్నికల కమిషనర్లను నియమించాలని కోరారు.
విజయవాడ: ఏపీలో ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించి మేలో ఫలితాలిస్తుడటంతో ఈవీఎంలు మిస్ అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA PAUL) అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల అధికారిని కలిశానని.. ఎలక్షన్‌ను ఏప్రిల్‌లో నిర్వహించవద్దని కోరానని తెలిపారు. ఏపీకి ముగ్గురు ఎన్నికల కమిషనర్లను నియమించాలని కోరారు. తెలంగాణలోని వరంగల్ నుంచి బాబూ మోహన్, విశాఖపట్నం నుంచి కేఏ పాల్ ఎంపీలుగా పోటీ చేస్తామని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. 175 సీట్లలో జనసేన పోటీ చేయాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య చెప్పారని..పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. పవన్ ఆస్తులు కాపాడుకోవాలనే బీజేపీతో పొత్తు అంటున్నారని ఆరోపించారు. ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తున్నారో వారిపైనే ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తన ప్రాపర్టీల కోసమే అన్నతో గొడవపడుతుందన్నారు. మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే చట్టాలన్నీ మారిపోతాయన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కేఏపాల్ కోరారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి