Tirumala Controversy: తిరుమలపై కేఏ పాల్ సంచలన డిమాండ్..
ABN , Publish Date - Sep 26 , 2024 | 05:45 PM
'తిరుమలను ప్రత్యేక దేశంగా చేయండి'.. మీరు విన్నది నిజమే. ఎవరో సాదాసీదా వ్యక్తి ఈ డిమాండ్‌ను తెరపైకి తేలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ నాయకుడే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయన మరెవరో కాదు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్(KA Paul).
అమరావతి: 'తిరుమలను ప్రత్యేక దేశంగా చేయండి'.. మీరు విన్నది నిజమే. ఎవరో సాదాసీదా వ్యక్తి ఈ డిమాండ్‌ను తెరపైకి తేలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ నాయకుడే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయన మరెవరో కాదు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్(KA Paul). తిరుమల లడ్డూ కల్తీపై తనదైన శైలిలో ప్రభుత్వాన్ని అటు విపక్షాన్ని ప్రశ్నిస్తూ వస్తున్న కేఏ పాల్ అనూహ్య డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఏపీ హైకోర్టు(AP High Court) లో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఇటలీ ప్రభుత్వం 741 మంది క్యాథలిక్‌లో వాటికన్‌ను దేశంగా ప్రకటించగా 34 లక్షల మంది ప్రజలు, మూడు లక్షల కోట్ల ఆస్తులున్న తిరుపతిని ఎందుకు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేంద్రపాలిత ప్రాంతం సాధ్యం కాకపోతే ప్రత్యేక దేశమైనా చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో శాంతి భద్రతలు పరిరక్షించాలని కూటమి ప్రభుత్వాన్ని పాల్ కోరారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు కలిసి ఉండాలని , దీనిని రాజకీయం చేయవద్దని సూచిస్తూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు నోటీసులు పంపించనున్నట్లు తెలిపారు.
లడ్డూ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయని పాల్ అన్నారు. డీజీపీ, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి లడ్డూపై రాజకీయ ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోర్టులో పిల్ వేసినట్లు చెప్పారు. తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయంగా వాడుకోవాలని కొందరు ఆలోచిస్తున్నారని పాల్ ఆరోపించారు.
Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన బాధితురాలి లాయర్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి