Share News

Deputy CM: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Oct 10 , 2024 | 10:01 AM

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి స్థలం‌ కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ స్థలం పత్రాలను ఆ గ్రామ పెద్దలకు అధికారికంగా అంద చేశారు. మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి.. ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతామన్నారు.

Deputy CM: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

అమరావతి: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రూ. 60 లక్షలు (Rs. 60 lakhs) సొంత నిధులు వెచ్చించి ఆ ఊరిలో పాఠశాల కోసం ఎకరం ఆట స్థలం కొనుగోలు చేసి.. ఆ స్థలాన్ని మైసూరవారిపల్లి (Mysorevaripalli) పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సందర్భంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం లేదన్న విషయాన్ని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పవన్ కల్యాణ్‌కు వివరించారు. దసరాలోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని నాడు ఆయన హామీ ఇచ్చారు.


ఇప్పుడు పవన్ కల్యాణ్ సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి స్థలం‌ కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ స్థలం పత్రాలను ఆ గ్రామ పెద్దలకు అధికారికంగా అంద చేశారు. మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి.. ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘బలమైన శరీరం ఉంటేనే.. బలమైన మనస్సు ఉంటుంది. బలమైన దేహదారుఢ్యం ఉంటేనే మానసికంగా మెరికల్లాంటి భావి తరాలు తయారవుతాయి. అలాంటి వారే దేశ సంపద అవుతారు. అయితే మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరం అయిన ఆట స్థలాలు పాఠశాలల్లో అందుబాటులో లేవు. మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సమయంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం లేదని విద్యార్ధుల తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. దసరా లోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాను. ఆ మాట ప్రకారం నా సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చానని’’ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.


కాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా ఏళ్లకు మళ్లీ పల్లెల్లో అభివృద్ధికాంతులు దర్శనమిస్తున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ పల్లెల్లో తన మార్కుపాలన కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ హయాంలో కునారిల్లిన గ్రామ పంచాయతీలకు మళ్లీ జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను అప్పట్లో జగన సర్కారు ఇతరత్రా వాటికి వాడేసింది. దీంతో పంచాయతీ ఖజానా ఖాళీ అయింది. కనీసం బ్లీచింగ్‌ పౌడరు చల్లేందుకు కూడా నిధులు లేని దుస్థితి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పంచాయతీలకు ఊపిరి పోస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. దీంతో గ్రామ పంచాయతీలకు పూర్వవైభవం దిశగా అడుగులు పడుతున్నాయి.

జిల్లాలో రూ.71 కోట్లతో పల్లెలకు మౌలిక వసతులు

జిల్లాలో 562 గ్రామ పంచాయతీల్లో రూ.71.15 కోట్ల వ్యయంతో ిసిమెంటు రోడ్లు, డ్రైనేజీలు, మెటల్‌ రోడ్లు, ఇతర పనులను పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ‘పల్లె పండుగ’ పేరిట పంచాయతీ వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో అబవృద్ధి పనులు చేపడతారు. రహదారులు అన్నీ సంక్రాంతిలోపు అందుబాటులోకి తీసుకువచ్చి పండుగ వాతావరణంలో కళకళలాడాలనేది ప్రభుత్వలక్ష్యం. అయితే ఈ పనులన్నీ డిసెంబరులోగా పూర్తి చేసేందుకు టార్గెట్‌ పెట్టుకున్నారు. ఇందులో రూ.56.72 కోట్లతో 12.65 కిమీ సీసీరోడ్లు, రూ.7.90కోట్లతో 140 కి.మీ బీటీ రోడ్లు, రూ.3.62 కోట్లతో 24కి.మీ డబ్ల్యుబీఎం రోడ్లు, రూ.2.85 కోట్లతో 43 పాఠశాలలకు 28.25 మీటర్ల మేర కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం చేపడతారు.


కేటాయింపులు ఇలా

మైదుకూరు నియోజకవర్గంలో 203 పనులు చేప్టట్టనున్నారు. కమలాపురంలో 278పనులు, బద్వేలులో 213, పులివెందులలో 89, జమ్మలమడుగులో 116, ప్రొద్టుటూరులో 48, రాజుపాళెంలో 29.. మొత్తం 976 పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.71.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే ఇప్పటికే 955 పనులు శ్రీకారం చుట్టగా 21 పనులు జరుగుతున్నాయి. ఇక 14 వతేదీ నుంచి 20 వరకు పండుగ వాతావరణంలో మిగిలిన పనులను ప్రారంభించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రతన్ టాటా మృతిపట్ల కేసీఆర్ సంతాపం

దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తు్న్న అమ్మవారు..

గొప్ప మానవతావాదిని కోల్పోయాం: సీఎం చంద్రబాబు

దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది: సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 10 , 2024 | 10:01 AM