Sand Reach ఇసుక రీచపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ
ABN , Publish Date - Sep 07 , 2024 | 12:01 AM
మండలంలోని గండికొవ్వూరు గ్రామం లో ఇసుకు రీచకు సంబంధించి డీఆర్వో గంగాధర్‌గౌడ్ పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు.
చక్రాయపేట, సెప్టెంబరు 6: మండలంలోని గండికొవ్వూరు గ్రామం లో ఇసుకు రీచకు సంబంధించి డీఆర్వో గంగాధర్‌గౌడ్ పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు. గండికొవ్వూరు సమీపాన పాపాఘ్నిలో ఇసుక తవ్వకం చేపట్టడంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈసందర్భంగా గ్రామస్తులు ఇక్కడ ఇసుక రీచ ఏర్పాటు చేస్తే భూగర్భజలాలు తగ్గిపోతాయని.. పంట పొలాలకు నీరు లేకుండాపోయి.. వేలాది ఎకరాలు బీడుగా మారిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు చేపడితే వాహనాల కింద పడి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. ఇక్కడ ఇసుక రీచలు వద్దని మూకుమ్మడిగా వాదనలు వినిపించారు. డీఆర్వో వారికి సర్దిచెప్పిన వినలేదు. ఇక్కడ పరిస్థితిని కలెక్టర్‌కు తెలియజేస్తానని చెప్పడంతో వారు శాంతించారు. ఆర్డీఓ వెంకటేశులు, తహసీల్దార్ విజయకుమారి, గ్రౌండ్ వాటర్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.