Share News

నిబంధనల ప్రకారం గణేశ్‌ ఉత్సవాలు, Ganesh Utsavs as per rules

ABN , Publish Date - Aug 30 , 2024 | 11:11 PM

కడప కార్పొరేషన్‌ పరిధిలో నిబంధనల ప్రకా రం గణేశ ఉత్సవాలు చేసుకోవాలని కమి షనర్‌ వైవో నందన్‌ సూచించారు. గణేశ్‌ ప్రతిమలు పెట్టేటప్పుడు పోలీసు, ఫైర్‌, కార్పొరేషన్‌ అనుమతులు తప్పనిసరన్నా రు.

నిబంధనల ప్రకారం గణేశ్‌ ఉత్సవాలు, Ganesh Utsavs as per rules
సమావేశంలో మాట్లాడుతున్న కడప నగర పాలక కమిషనరు వైవో నందన్‌

పోలీసు, ఫైర్‌, కార్పొరేషన్‌ అనుమతులు తప్పనిసరి

ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగించరాదు : కమిషనర్‌ వైఓ నందన్‌

కడప (ఎడ్యుకేషన్‌), ఆగస్టు 30: కడప కార్పొరేషన్‌ పరిధిలో నిబంధనల ప్రకా రం గణేశ ఉత్సవాలు చేసుకోవాలని కమి షనర్‌ వైవో నందన్‌ సూచించారు. గణేశ్‌ ప్రతిమలు పెట్టేటప్పుడు పోలీసు, ఫైర్‌, కార్పొరేషన్‌ అనుమతులు తప్పనిసరన్నా రు. ప్రభుత్వ ఆస్తులకు రోడ్లకు ఎటువం టి భంగం కలిగించకూడదన్నారు. నిబం ధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కార్పొరేషన్‌ సమావేశ మందిరంలో టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, పబ్లిక్‌హెల్త్‌, రెవెన్యూ అఽధి కారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణపై టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిబంధనల ప్రకారం గణేశ్‌ ప్రతి మలు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నా రు. గణేశ్‌ ప్రతిమలు పెట్టుకునే వారు తప్ప కుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పంది ళ్లు వేయాలన్నా రోడ్లు, ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఆస్తు లు, రోడ్లను డ్యామేజీ చేసినట్లయితే మరమ్మ త్తులు చేసేలా చర్యలు తీసుకోవాలని లేదంటే వారిపై జరిమానా వేసేలా చర్యలు తీసుకోవా లని సూచించారు.


గణేశ్‌ ఉత్సవాలకు రెండు రోజుల ముందుగానే శానిటేషన్‌ అధికారులు వారికి కేటాయించిన ప్రాంతమంతా శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఫాగింగ్‌, బ్లీచింగ్‌ చేయాలని సూచించారు. అనంతరం నిమజ్జ నానికి కేటాయించిన స్థలాల్లో అధికారు లకు విధులు కేటాయించాలన్నారు. ప్రతిమల నిమజ్జనం కోసం ప్రత్యేక రూట్‌మ్యాప్‌ ఏర్పాటు చేసి వారికి కేటాయించిన ప్రాంతాల్లో నిమజ్జనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నా రు. 3, 5, 7, 11 రోజుల్లో నిమజ్జనం చేస్తారు కాబట్టి ఊరేగింపు మార్గాల్లో కరెంటు తీగలు, కేబుల్‌ వైర్లు అడ్డురా కుండా ముందుగానే చర్యలు తీసుకో వాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. అధికారులంతా చిత్తశుద్ది తో విధులు నిర్వహించాలని దీనికి సంబంధిం చిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనరు రాకేశ్‌ చంద్రన్‌, డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావు, సిటీ ప్లానర్‌ సూరజ్‌, ఎంఎహెచ్‌ఓ చంద్రశే ఖర్‌, ఈఈ ధనలక్ష్మి, మేనేజరు వెంకట రామిరెడ్డి, సూపరింటెండెంట్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 11:11 PM