police రౌడీ అనే మాట వినిపిస్తే తోలు తీస్తా : డీఎస్పీ
ABN , Publish Date - Sep 23 , 2024 | 11:33 PM
కడప నగరంలో ఇక నుంచి రౌడీ అనే మాట వినిపిస్తే తోలు తీస్తామని.. రోడ్లపై అమాయకులపై దాడి చేస్తే సహించేది లేదని... రౌడీషీట్ ఓపెన చేస్తామని కడప ఇనచార్జ్ డీఎస్పీ రమాకాంత హెచ్చరించారు.
కడప (క్రైం), సెప్టెంబరు 23: కడప నగరంలో ఇక నుంచి రౌడీ అనే మాట వినిపిస్తే తోలు తీస్తామని.. రోడ్లపై అమాయకులపై దాడి చేస్తే సహించేది లేదని... రౌడీషీట్ ఓపెన చేస్తామని కడప ఇనచార్జ్ డీఎస్పీ రమాకాంత హెచ్చరించారు. నగరంలోని బిల్డప్ సర్కిల్‌లో వారం రోజుల క్రితం షేక్ మహబూబ్‌బాషా అనే వ్యక్తిపై దాడి చేశారు. అతను భయంతో పరిగెత్తుతుండగా ఏడుగురు వ్యక్తులు అతని వెంటపడి నడిరోడ్డుపై చితగ్గొట్టి గాయపరిచారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తాలుకా పోలీసుస్టేషనలో సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. కడపకు చెందిన మహబూబ్‌బాష బిల్డప్ సమీపంలోని ఓ బార్‌లో కూర్చుని ఒంటరిగా మద్యం సేవిస్తున్నాడు. కడప రామరాజుపల్లె లోహియానగర్‌కు చెందిన గూడూరు రాజగోపాల్ స్నేహితులతో కలి సి అదే బార్‌కు వచ్చారు. ఒంటరిగా ఉన్న మహబూబ్‌బాషాను పక్కకు వెళ్లాలంటూ దాడి చేశారు. దీంతో వారి దెబ్బలు తట్టుకోలేక మహబూబ్ బాషా పరిగెడుతుంటే రాజగోపాల్ అతని స్నేహితులు కలిసి వెంబడించి నడిరోడ్డుపై కాళ్లు చేతులతో కొట్టడంతో పాటు చాకుతో దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నిందితులైన గూడూరు రాజగోపాల్, రామరాజుపల్లెకు చెందిన మహబూబ్‌బాషా, లోహియానగర్‌కు చెందిన అదే ప్రాంతానికి చెందిన షేక్ నూరుల్లా, మరియాపురానికి చెందిన శీలం బాలస్వామి, ఆలియా్‌సబాలు, కడప రవీంద్రనగర్‌కు చెందిన షేక్ జిలానీబాషాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వీరిలో బాలస్వామిపై తాలుకా పోలీసుస్టేషనలో రౌడీ షీట్ ఉందన్నారు. నడిరోడ్డుపై రౌడీల్లా ప్రవర్తిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై రౌడీషీట్ ఓపెన చేస్తామని తెలిపారు.