YSRCP: జగన్ రెడ్డి సొంత బంధువుల్లో నోటీసుల కలకలం..
ABN , Publish Date - Dec 04 , 2024 | 09:07 AM
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా పోస్టుల కేసులో పులివెందుల పోలీసులు వేగం పెంచారు. 74 మందిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులోఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డితో పాటు ముగ్గురు అరెస్టయ్యారు. పులివెందుల డీఎస్పీ కార్యా లంయంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వరుసగా విచారణకు హాజరవుతున్నారు.
కడప జిల్లా: పులివెందుల (Pulivendula) మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan Mohan Reddy) సొంత బంధువుల్లో నోటీసుల (Notices) కలకలం రేగింది. వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి (Krishna Reddy) వేసిన ప్రైవేటు కేసు (Private case)కు సంబందించి గురువారం10 మందిని పులివెందుల పోలీసులు (Police) విచారించనున్నారు. నోటీసులు అందుకొని విచారకు హాజరవుతున్నవారిలో జగన్ సొంత బంధువులు.. వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ సురేంద్ర నాధ్ రెడ్డి, వైఎస్సార్ ట్రస్ట్ చైర్మెన్ జనార్ధన్ రెడ్డి, న్యా యవాది ఓబుల్ రెడ్డిలతో పాటు మరో ఐదుగురు ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే కృష్ణారెడ్డిని విచారించి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.
కాగా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా పోస్టుల కేసులో పులివెందుల పోలీసులు వేగం పెంచారు. 74 మందిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులోఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డితో పాటు ముగ్గురు అరెస్టయ్యారు. పులివెందుల డీఎస్పీ కార్యా లంయంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వరుసగా విచారణకు హాజరవుతున్నారు.
కాగా జగన్ తన సొంత బాకా ఊదించుకోవడానికి ప్రకటనల రూపంలో రూ.వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని తన రోత మీడియాకు సమర్పించారు. వలంటీర్లకు తన రోత పత్రికను అంటగట్టి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి స్వాహా చేశారు. చివరికి తన రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లేందుకు తన పత్రిక, చానల్ ఉద్యోగులు, వైసీపీ సోషల్ మీడియా సైకోలకు వందల కోట్ల రూపాయలు పంచేశారు. ఇదీ వైసీపీ హయాంలో... నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక అరాచకం! అయితే, ఈ చెల్లింపులకు డిజిటల్ కార్పొరేషన్ నిధులను అడ్డగోలుగా వాడుకున్నట్లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. డిజిటల్ కార్పొరేషన్‌లో ఆనాడు పాల్పడిన అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కొన్ని రోజులుగా చేస్తున్న ఫోరెన్సిక్ ఆడిట్‌లో సోషల్ సైకోలు కొందరు విధులకు హాజరు కాకుండానే జీతాలు తీసుకున్నట్లు బయటపడింది. ఒక యూ ట్యూబ్ చానెల్ యజమాని ఇంట్లో పనోళ్ల నుంచి, నాటి విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై బురద జల్లిన ప్రతి యూ ట్యూబ్ చానెల్‌కు కూడా ఇక్కడి నుంచే చెల్లింపులు జరిగాయి.
జగన్ ఎన్నికల ప్రచారంలో డ్రామా సీన్లు రక్తికట్టించేందుకు ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయిన ఐ-ప్యాక్, ఐడ్రీమ్స్‌తోపాటు బూతులతో ప్రతిపక్షాలపై విరుచుకుపడే సజ్జల భార్గవ రెడ్డి, మార్ఫింగ్ ఫొటోలతో టీడీపీ, జనసేన నేతల పరువు తీసేందుకు ప్రయత్నించే సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు విభాగాలుగా చేసిన చెల్లింపుల్లో ఇప్పటి వరకూ నాలుగు విభాగాలకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేయించిన విజిలెన్స్ అధికారులు యాభై కోట్ల రూపాయలకుపైగా అక్రమ చెల్లింపులను గుర్తించారు. మరో రెండు పూర్తి అయితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని విజిలెన్స్ వర్గాల సమాచారం.
సైకోలకు రాజపోషణ..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంటూ....2020 సెప్టెంబరు 23న వైసీపీ ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ తరగతులు, లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని అప్పట్లో బయటికి ప్రకటించింది. అంతర్గతంగా మాత్రం.. జగన్‌కు బాకా ఊదాలి.. ప్రతిపక్షాలపై బురద జల్లాలి.. అనే లక్ష్యంతో వైసీపీ కార్యకర్తలు, సోషల్ సైకోలు ఇందులో ఉద్యోగులుగా ఆనాడు చేరి జీతాలు తీసుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, వంగలపూడి అనిత.. వారి కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీజేఐ కుమార్తెలను సైతం వదిలిపెట్టలేదు. ఇటువంటి వారికి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల్లో వేతనాల కింద ప్రతి నెలా రెండు కోట్ల చొప్పున జగన్ ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన కంటెంట్ పోస్టు చేస్తూ అసలు ఉద్యోగానికే రాని వారంతా జగన్ హయాంలో జీతాలు తీసుకున్నారు. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని దారుణంగా ఓడించి ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టడంతో దర్యాప్తు సంస్థలు గత ఐదేళ్ల అక్రమాలను వెలికి తీస్తున్నాయి.
తనకు సొంత మీడియా లేదంటూ పదే పదే అబద్ధాలు చెప్పే జగన్ తన రోత పత్రిక, టీవీకి వందల కోట్ల రూపాయల ప్రకటనలు జారీ చేయించుకున్నారు. ఇందుకు సహకరించిన నాటి సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై పాత్రికేయ సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. పత్రికల సర్క్యులేషన్ పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా, అడ్డగోలుగా ఆనాడు ముఖ్యమంత్రి జగన్ సొంత మీడియాకు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును ఆయన దోచిపెట్టారని ఆక్షేపించాయి. చంద్రబాబు ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించడంతో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది. అందులో రోత పత్రిక ఉద్యోగులకు అడ్డగోలుగా జీతాలు.. జగన్ మీడియాకు వందల కోట్ల ప్రకటనలు ఇచ్చినట్లు తేలింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని నివాసిగా ఏపీ సీఎం చంద్రబాబు
కోహ్లీకి గాయం.. రెండో టెస్ట్‌కు డౌట్..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో టీం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News