Share News

AP News: ఎమ్మెల్యే మాధవి ఇష్యూ.. కడప మేయర్ ఏం చెప్పారంటే

ABN , Publish Date - Nov 07 , 2024 | 03:14 PM

Andhrapradesh: కడప కార్పోరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుర్చీ వ్యవహారానికి సంబంధించి మేయర్ సురేష్ బాబు స్పందించారు. ఎమ్మెల్యే మాధవికి గౌరవం ఇచ్చి గతంలో మేయర్ సీటు పక్కన కూర్చోబెట్టామని.. కానీ ఆమె గౌరవాన్ని నిలుపుకోలేకపోయారన్నారు. అందుకే కుర్చీ కింద వేశామని చెప్పుకొచ్చారు. ప్లాన్ ప్రకారమే కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే రభస చేశారని అన్నారు.

AP News: ఎమ్మెల్యే మాధవి ఇష్యూ.. కడప మేయర్ ఏం చెప్పారంటే
Kadapa Mayor Suresh Babu

కడప, నవంబర్ 7: నగర కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసిపోయింది. టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుర్చీ వ్యవహారం తీవ్ర రచ్చకు దారి తీసింది. కావాలనే తన కుర్చీని మేయర్ పక్కన కాకుండా కౌన్సిలర్ల వద్ద వేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ క్రమంలో సమావేశంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తాజాగా ఈ వ్యహారంపై కడప వైసీపీ నగర మేయర్ సురేష్ బాబు (Kadapa Mayor Suresh Babu ) స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాధవికి గౌరవం ఇచ్చి గతంలో మేయర్ సీటు పక్కన కూర్చోబెట్టామని.. కానీ ఆమె గౌరవాన్ని నిలుపుకోలేకపోయారన్నారు. అందుకే కుర్చీ కింద వేశామని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan: వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన


ప్లాన్ ప్రకారమే కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే రభస చేశారని అన్నారు. గత సమావేశంలో ఒక నియంతలా వ్యవహరించడంతో కుర్చీ కింద వేసినట్లు వివరించారు. ప్రజాస్వామ్యంలో ఇలా వ్యవహరించడం ఆమె స్థాయికి తగదన్నారు. అగౌరవపరచాలంటే లోపలికి రాకుండా నిరసన తెలపాలనుకున్నామని.. కానీ ఆమెను గౌరవించి లోపలికి రానిచ్చామని తెలిపారు. ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నామని... ఏ పార్టీ వారినైనా ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళమని చెప్పుకొచ్చారు. మీటింగ్‌లోనే సాటి మహిళా కార్పొరేటర్‌ను అవమానంగా ఎమ్మెల్యే మాట్లాడారని తెలిపారు. రాష్ట్రంలో హిట్లర్, నియంత పాలన సాగుతోందని విమర్శించారు. వందలాది మందితో సమావేశానికి రావడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియో మెంబర్ మాత్రమేనని గుర్తించుకోవాలన్నారు. ఏపీలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వని గౌరవం ఇచ్చామని... దాన్ని మాధవి నిలుపుకోలేకపోయారని మేయర్ సురేష్ బాబు పేర్కొన్నారు.

CM Chandrababu: జగన్ సిగ్గుందా.. చంద్రబాబు మాస్ వార్నింగ్


కాగా.. గురువారం ఉదయం కడప కార్పోరేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మాధవి హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానికి తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలను తీసుకొని ఎమ్మెల్యే మునిసిపల్ కార్పొరేషన్‌కు వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేను మినహా మిగతా ఎవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. లోపలికి వెళ్లిన వెంటనే మాధవి రెడ్డి... తన కుర్చీని ఎందుకు మార్చారంటూ నిలదీశారు. ఇన్నాళ్లు మేయర్ పక్కన కుర్చీ వేసి.. ఇప్పుడెందుకు కార్పోరేటర్ల వద్ద వేశారని ప్రశ్నించారు. ఈ క్రమంలో మాధవిరెడ్డి, వైసీపీ పాలక వర్గ నేతల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. డయాస్ పైన కుర్చీ లేకపోవడంతో నిలబడి మాట్లాడిన ఎమ్మెల్యే.. పక్కనే ఉన్న వైసీపీ మేయర్ సురేష్ బాబుపై ఫైర్ అయ్యారు. ‘‘పాలకవర్గం మీదని.. టీడీపీ ఎమ్మెల్యే మహిళనైన నన్ను అవమా నించారు. మీ అవినీతి భాగోతాన్ని మొత్తం బయటికి లాగుతాము. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని వైసీపీ మేయర్‌కు ఎమ్మెల్యే మాధవి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆపై సమావేశాన్ని మేయర్, కార్పోరేటర్లు వాకౌట్ చేసి వెళ్లిపోయారు.


ఇవి కూడా చదవండి...

Narayana: రాజధానికి భూములు.. రంగంలోకి దిగిన నారాయణ.. సక్సెస్ అయ్యేనా

Vijayasaireddy ఉత్తరాంధ్రలో అసెంబ్లీ స్థానాలపై విజయసాయి సంచలన కామెంట్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 03:42 PM