Share News

Poaching of fish in Wamikonda వామికొండ జలాశయంలో చేపల అక్రమవేట

ABN , Publish Date - Sep 27 , 2024 | 11:22 PM

మండల పరిధి ఉప్పలూరు సమీపంలోని వామికొండ జలాశయంలో అక్రమంగా చేపలు పట్టి.. భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Poaching of fish in Wamikonda వామికొండ జలాశయంలో చేపల అక్రమవేట
జలాశయంలోకి తెప్పలో వెళ్లి వలతో చేపలు పడుతున్న వ్యక్తి

ముద్దనూరు, సెప్టెంబరు 27: మండల పరిధి ఉప్పలూరు సమీపంలోని వామికొండ జలాశయంలో అక్రమంగా చేపలు పట్టి.. భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే... గండికోట ప్రాజెక్టుకు భారీగా కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. అందులో అంతర్భాగమైన గాలేరు-నగిరి కాల్వ నుంచి వామికొండ జలాశయం, సర్వరాయసాగర్‌కు నీళ్లను విడుదల చేశారు. దీంతో వామికొండ జలాశయంకు భారీ ఎత్తున జలాలు చేరాయి. అందులో పెద్దపెద్ద చేపలు చేరడంతో చేపలు పట్టే కొన్ని బ్యాచ్‌లు జలాశయం వద్ద తిష్టవేశాయి. జలాశయం బ్యాక్‌వాటర్‌ సమీపంలోని కోనాపురం, కొలవలి ప్రాంతంలో కొంద రు బ్యాచ్‌లుగా ఏర్పడి వలలు వేసి భారీ ఎత్తున చేపలు పడుతున్నారు. ఒక్కో బ్యాచ్‌ రోజుకు 50 కేజీల చొప్పున దాదాపు 14 బాక్సులు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అంటే రోజుకు ఒక్కో బ్యాచ్‌ రూ.50వేలు పై చిలుకు చేపలు అక్రమంగా రవాణా చేస్తున్నారు. చేపల అక్రమవేటపై చర్యలు చేపట్టాల్సిన జలాశయం అధికారులు పట్టించుకోవడం లేదని స్థాని కులు ఆరోపిస్తున్నారు. వెంటనే చేపల వేటను అరికట్టాలని కోరుతున్నారు.

అధికారులకు ఫిర్యాదు చేస్తాం..

కొందరు భయటి వ్యక్తులు బ్యాచ్‌లుగా ఏర్పాడి జలాశయం పరిసర ప్రాంతాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారు. దాదాపు రోజుకు లక్షల రూపాయలు విలువ చేసే చేపలు ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తు న్నారు. ఈ విషయమై జలాశయం అధికారులకు ఫిర్యాదు చేస్తాం.

-గంగయ్య, సర్పంచ్‌, ఉప్పలూరు

Updated Date - Sep 27 , 2024 | 11:22 PM