YSRCP: జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం...
ABN , Publish Date - Nov 11 , 2024 | 11:06 AM
అమరావతి: ప్రతిపక్ష నేతగా గుర్తించి సభా నాయకుడితో సమానంగా మైక్ ఇచ్చి మాట్లాడేందుకు సమయం ఇస్తేనే అసెంబ్లీకి వెళతానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లోఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్‌తో సహా మొత్తం 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపింది సభకు వెళ్లకుండా ఎగవేయడానికా అని నిలదీస్తున్నారు.
అమరావతి: ప్రతిపక్ష నేతగా గుర్తించి సభా నాయకుడితో సమానంగా మైక్ ఇచ్చి మాట్లాడేందుకు సమయం ఇస్తేనే అసెంబ్లీకి వెళతానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు (YSRCP Chief), పులివెందుల ఎమ్మెల్యే జగన్ (MLA Jagan) చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం (People are angry) వ్యక్తమవుతోంది. జగన్‌తో సహా మొత్తం 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీ (Assembly)కి పంపింది సభకు వెళ్లకుండా ఎగవేయడానికా అని నిలదీస్తున్నారు. జగన్ తీరు అసలుకే మోసం తెచ్చేలా ఉందని సొంతపార్టీ నేతలే బాహటంగా అంటున్నారు. జనం ఇస్తేనే కదా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కేది... ఆ పదవి ఇస్తేనే సభకు వెళ్తానని మారం చేయడం ఏంటని సొంత పార్టీ నేతలు ఆక్షేపిస్తున్నారు.
సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తాడేపల్లిలో తనను ఎదురు ప్రశ్నించని విలేకరులను ముందేసుకుని జగన్ మాట్లాడారు. సభలో మాట్లాడినట్లే మీడియాతో రోజూ గంటసేపు మాట్లాడతానని, ప్రజా సమస్యలు లేవనెత్తుతానని ప్రకటించారు. అయితే ప్రత్యర్థి పార్టీలు జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డాయి. జగన్ చెప్పిందల్ల వింటేనా ప్రజాస్వామ్యమా.. అని విరుచుకుపడ్డాయి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తేందుకు జనం శాసనసభ్యులుగా గెలిపించి పంపారని ప్రతిపక్ష హోదా వస్తుందనే, ప్రతిపక్ష నేత పదవి వస్తుందనో కాదని.. జగన్ సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని షర్మల డిమాండ్ చేశారు. అధికారపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఇదే డిమాండ్ అందుకున్నాయి. జగన్ బాద్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశాయి. సభలో పార్టీలు, సంఖ్యాబలం ప్రకారమే విపక్ష హోదా, విపక్షనేత హోదా లభిస్తాయని తెలిసి నాటకాలు ఆడుతున్నారని అన్నారు. గత ఐదేళ్ల దుష్పరిణామాలపై సభలో అధికారపక్షం నిలదీస్తే జవాబు ఇవ్వలేమని ముందే చేతులెత్తేసారని, దీన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్ష సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
జగన్ హయాంలో సంఖ్యాబలం ఆధారంగానే టీడీపీ సభ్యులకు సభలో సమయం కేటాయించారని గుర్తుచేస్తున్నాయి. ఇప్పుడు మాత్రం సభలో సీఎం చంద్రబాబుతో సమానంగా తాను కోరుకున్నప్పుడల్లా మైకు ఇవ్వాలని.. తాను సీఎంగా ఉన్నప్పటి భద్రత కల్పించాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని ఆక్షేపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించనప్పుడు రాజీనామా చేయాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. దీంతో జగన్ నిర్ణయం రాజకీయంగా బూమరాంగ్ అవుతోందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతికి నిధులపై త్రైపాక్షిక చర్చలు ..
కొత్త ప్యాలస్ నిర్మాణంలో ఆ ఇద్దరితే కీలక పాత్ర..
కార్తీక మాసం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News