Vivekananda వివేకానందుని బాటలో యువత నడవాలి
ABN , Publish Date - Sep 19 , 2024 | 11:36 PM
స్వామి వివేకానందుని అడుగుజాడలలో నడిచి యువత సన్మార్గం వైపు పయనించాలని స్టెప్ సీఈఓ సి.సాయిగ్రేస్ అన్నారు.
స్టెప్ సీఈఓ సాయిగ్రేస్
కడప (స్పోర్ట్స్) సెప్టెంబర్ 19: స్వామి వివేకానందుని అడుగుజాడలలో నడిచి యువత సన్మార్గం వైపు పయనించాలని స్టెప్ సీఈఓ సి.సాయిగ్రేస్ అన్నారు. వివేకానందుని జయంతి సందర్భంగా స్టెప్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక స్పిరిట్స్ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 230 మంది హాజరయ్యారు. కాగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్ధేశించి సాయిగ్రేస్ మాట్లాడుతూ యువతకు ఆదర్శప్రాయుడుగా ఖ్యాతిగాంచిన స్వామి వివేకానందుడి జయంతిని పురష్కరించుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ల్లో యువజనోత్సవాలు జరుగనున్నాయన్నారు. ప్రధానంగా యువతకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనాలన్నారు. డాక్టర్ వైయ్‌సఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాధకుమార్ మాట్లాడుతూ సమాజంలో మంచి కన్నా చెడు ఎక్కువగా ప్రభావం చూపుతుందని, యువత మంచి మార్గంలో పయనించి తల్లిదండ్రులకు, సమాజానికి పేరు తీసుకురావాలన్నారు. అప్పుడే సమాజ వికాసం కాగలదన్నారు. మైనార్టీ కార్పొరేషన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.బ్రహ్మయ్య, జిల్లా ఫైర్ అధికారి ధర్మారావు, నెహ్రు యువకేంద్ర జిల్లా యువ అధికారి మణికంఠ, స్పిరిట్స్ కళాశాల డైరెక్టర్ రవీం ద్ర, కళాశాల, స్టెప్ సిబ్బంది పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు
యువజనోత్సవాలలో భాగంగా జానపద, స్టోరీ రైటింగ్, పెయింటింగ్, కవిత్వం, డిక్లమేషన తదితర పోటీలు నిర్వహించి విజే తలకు బహుమతులు అందజేశారు. ఇందులో పోయట్రీ విభాగంలో బి.దస్తగిరి ప్రథమ విజేతగా, ఎస్.సురేఖ ద్వితీయ విజేతగా నిలిచారు. డిక్లమేషన విభాగంలో ప్రథమ విజేతగా ఎస్. సమీనా, ద్వితీయ విజేతగా ఎస్.ఏ.అహ్మద్, స్టోరీ రైటింగ్ విభాగంలో ప్రథమ విజేతగా ఎస్.సానియా, ద్వితీయ విజేతగా ఎస్.జెబా, పెయింటింగ్ విభాగంలో ప్రథమ విజేతగా హరినాయక్, ద్వితీయ విజేతగా టి.చంద్రభాను నిలిచారు. ఫోక్ డాన్స (గూప్) ప్రథమ విజేతగా పి.యస్విత, ద్వితీయ విజేతగా జయచంద్ర, ఫోక్ డ్యాన్స (సోలో) ప్రథమ విజేతగా ఎన.ఉషోదయ, ద్వితీయ విజేతగా టి.సుదేష్ణ, ఫోక్ సాంగ్ (సోలో) ప్రథమ విజేతగా కె.మురళిమోహన, ద్వితీయ విజేతగా డి.అనుష, ఫోక్ సాంగ్ (గ్రూప్) ప్రథమ విజేతగా ఎం.గణేష్ నిలవడంతో బహుమతులు అందజేశారు.