Share News

YSRCP: సోషల్ మీడియా కేసు.. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం..

ABN , Publish Date - Dec 31 , 2024 | 10:16 AM

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కేసుల్లో పులివెందుల పోలీసులు మరింత దూకుడు పెంచారు. వర్రా రవీందర్ రెడ్డి విచారణలో ఇచ్చిన వాంగ్మూలం మేరకు గుంటూరుకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని పులివెందులకు తరలించారు. వర్ర రవీంద్రరెడ్డి సహా కీలక నిందితులను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు.

YSRCP: సోషల్ మీడియా కేసు.. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం..
Varra Ravinder Reddy

కడప జిల్లా: వైఎస్సార్‌సీపీ (YSRCP) సోషల్ మీడియా కేసుల్లో (Social Media Case) పులివెందుల పోలీసులు (Pulivendula Police) దూకుడు పెంచారు. ఈ కేసులో అరెస్టయిన వర్రా రవీందర్ రెడ్డి (Varra Ravinder Reddy) విచారణలో ఇచ్చిన వాంగ్మూలం మేరకు గుంటూరుకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని పులివెందులకు తరలించారు. గుంటూరుకు చెందిన హరిక్రిష్ణా రెడ్డి, ప్రేమ్ సాగర్, వెంకట్రామి రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రొద్దుటూరులో రూరల్ ఎస్ఐ మహమ్మద్ రఫీపై రాజుపాలెంకు చెందిన కొందరు దాడి చేశారు. ఎస్ఐపై దాడికి పాల్పడిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 70 మందిపై కేసులు నమోదు అయ్యాయి. వర్ర రవీంద్రరెడ్డి సహా కీలక నిందితులను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఇదే కేసులో మరో 55 మందిని పులివెందుల పోలీసులు ప్రశ్నించనున్నారు. నిందితులకు 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు పిలవనున్నారు. రాయలసీమతోపాటు నెల్లూరు, హైదరాబాద్, విజయవాడలో ఈ 70 మంది ఉన్నారు. వర్ర రవీందర్ రెడ్డిని అరెస్టు చేసి విచారించగా అతని వాంగ్మూలం మేరకు మిగిలిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోలీస్ టీమ్ తిరుగుతోంది.


వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి మూడవ రోజు విచారణకు హాజరయ్యారు. కడపసైబర్ క్రైమ్ పోలిస్టేషన్‌లో రాఘవరెడ్డి విచారణ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా రాఘవరెడ్డి విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అసభ్య కర పోస్టులు వ్యవహారంలో వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు రాఘవరెడ్డిపైకేసు నమోదు అయ్యింది. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కాగా రాఘవ రెడ్డి వాంగ్మూలంలో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. వర్రా రవీంద్ర రెడ్డి ఎవరో తెలియదు అంటూ పోలీసులకు రాఘవరెడ్డి సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. రాఘవరెడ్డి వాంగ్మూలం మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా తొలిరోజు దాదాపు 10 గంటల పాటు రాఘవరెడ్డిని పోలీసులు విచారించారు. రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగించిన పోలీసులు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి రాఘవరెడ్డిని పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అయితే రాఘవరెడ్డి విచారణ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు.


కాగా... సోషల్ మీడియాలో పోస్టుల వ్యహారంలో అరెస్ట్ అయిన వర్రారవీంద్రారెడ్డి విచారణలో భాగంగా అవినాష్ పీఏ రాఘరరెడ్డి పేరు చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్‌ నుంచి కంటెంట్ అంతా రాఘవరెడ్డి వాట్సప్‌ నుంచి వచ్చిందని వర్రా వాంగ్మూలం ఇచ్చారు. రాఘవరెడ్డి చెప్పిన ప్రకారం వైఎస్ షర్మిల, సునీత, విజయమ్మపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టామని.. అలాగే సీఎం చంద్రబాబు, పవన్‌పై కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు వర్రా రవీంద్రారెడ్డి విచారణలో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన సంవత్సర వేడుకల జోష్

రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టులు..

పీఎస్‌ఎల్‌వి-సి 60 విజయవంతంపై సీఎం చంద్రబాబు హర్షం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 31 , 2024 | 10:56 AM