Pawan Kalyan : ఆలీషా నౌకల తయారీదారు!
ABN , Publish Date - Dec 04 , 2024 | 06:17 AM
కాకినాడకు చెందిన ఆలీషా బార్జిల (పెద్ద పడవలు లేదా నౌకలు) తయారీ వ్యాపారవేత్త అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పంపిన నివేదికలో కాకినాడ జిల్లా అధికారులు వివరించారు.
పవన్ కల్యాణ్‌కు అధికారుల నివేదిక
కాకినాడ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడకు చెందిన ఆలీషా బార్జిల (పెద్ద పడవలు లేదా నౌకలు) తయారీ వ్యాపారవేత్త అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పంపిన నివేదికలో కాకినాడ జిల్లా అధికారులు వివరించారు. ఇటీవల కాకినాడ వచ్చిన పవన్ పోర్టులో బియ్యం తనిఖీల సందర్భంగా ‘హూ ఈజ్ ఆలీషా’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన వివరాలను తెలియజేస్తూ ఉపముఖ్యమంత్రికి నివేదిక పంపారు. ‘కాకినాడ పోర్టులో ఆలీషా రెండెకరాలు లీజుకు తీసుకుని నౌకలు నిర్మిస్తున్నారు. ఒకప్పుడు ఆయిల్ స్మగ్లింగ్‌లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ముంబైలో బార్జిలు/నౌకలు నిర్మిస్తున్నారు. గతంలో ఆయిల్ మాఫియాకు ఆయన గోదాములు ఇచ్చారని.. గత ప్రభుత్వంలో బార్జిల వ్యాపారంలో పైచేయిగా ఉండేలా చక్రం తిప్పారని, పలు రాష్ట్రాలతోపాటు దుబాయ్‌లో ఆస్తులు పోగేశారని రిపోర్టులో ప్రస్తావించారు. కాగా.. ఆలీషాకు బియ్యం వ్యాపారాలు ఉన్నాయన్న అనుమానంతో పవన్ ఆరా తీయగా.. అధికారులు విచారించి ఆయనకు అసలు బియ్యం వ్యాపారమే లేదని తేల్చారు.