Kanna Lakshminarayana: దుర్మార్గపు పాలనలో ఏపీ విచ్ఛిన్నం.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరం
ABN , Publish Date - Jan 07 , 2024 | 01:39 PM
దుర్మార్గపు పాలనలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అన్ని రంగాల్లో విచ్ఛిన్నమైందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం అభిమానులందరిపైనా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) పిలుపునిచ్చారు.
- తెలుగుదేశం పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): దుర్మార్గపు పాలనలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అన్ని రంగాల్లో విచ్ఛిన్నమైందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం అభిమానులందరిపైనా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) పిలుపునిచ్చారు. మాజీమంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ శనివారం బెంగళూరు టీడీపీ ఫోరం కార్యాలయానికి వచ్చారు. సత్తెనపల్లితోపాటు అనుబంధ నియోజకవర్గాలకు చెంది బెంగళూరు(Bangalore)లో నివసిస్తున్నవారు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ఐటీ, కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ తెలుగుదేశం ఫోరం పేరిట పదేళ్లపాటు మీరు అందిస్తున్న సేవలకు ఆనందం కలుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పూర్వవైభవం తీసుకురావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరమని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనమే తీసుకుందామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో యువత సొంతూళ్లకు వెళ్లి ఓట్లు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం నాయకులు కనకమేడల వీర, శ్రీకాంత్ సోంపల్లి, లెనిన్ చౌదరి, విష్ణు నల్లూరి, రమేశ్ బొల్లినేని, శివ చినుమోలు, కేశవ్ కోకా, వెంకటరత్నం, విజయ్ రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.