Attack on Jagan: జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులకు షాక్ తప్పదా..?
ABN , Publish Date - Apr 18 , 2024 | 01:24 PM
ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు పోలీసులు చడీచప్పుడు లేకుండా నిందితులను అదుపులోకి తీసుకుని నేడు కోర్టులో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి తల్లిదండ్రులు తమ కుమారుల ఆచూకీని పోలీసులు తెలపడం లేదంటూ కోర్టు మెట్లెక్కారు.
విజయవాడ: ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ (CM Jagan)పై రాయి దాడి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు పోలీసులు చడీచప్పుడు లేకుండా నిందితులను అదుపులోకి తీసుకుని నేడు కోర్టులో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి తల్లిదండ్రులు తమ కుమారుల ఆచూకీని పోలీసులు తెలపడం లేదంటూ కోర్టు మెట్లెక్కారు. అసలు నిందితులను ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఏంటనేది మాత్రం ఇప్పటి వరకూ పోలీసులు అధికారికంగా ప్రకటించింది లేదు. ఈ కేసులో పోలీసులు ఎందుకంత గోప్యత ప్రకటిస్తున్నారనేది కూడా తెలియడం లేదు.
AP News: ఆ అధికారులకు ఇప్పుడు తత్వం బోధపడింది..
కాగా.. నలుగురు మైనర్లతో పాటు మరో నిందితుడు సతీష్ తరఫున ఇవాళ విజయవాడ కోర్టులో సెర్చ్ పిటిషన్ దాఖలైంది. మంగళవారం ఉదయం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకూ ఆచూకీ తెలపటం లేదంటూ ఐదుగురి తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కోర్టు ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రుల తరఫున లాయర్ సలీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తానికి పోలీసులకు షాక్ తప్పేలా లేదు. ఏపీలో ఈ వ్యవహారమంతా ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి...
CM Jagan: జగన్‌పై రాయి దాడి కేసులో బిగ్ అప్‌డేట్
AP Elections: ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల... మొదలైన నామినేషన్ల ప్రక్రియ
మరిన్ని ఏపీ వార్తల కోసం...