Share News

Kodali Nani: చంద్రబాబు కాళ్ల వద్ద కొడాలి నాని.. గుంటూరులో ఫ్లెక్సీ..!

ABN , Publish Date - Jun 16 , 2024 | 11:25 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సవాళ్ల పర్వం కొనసాగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం అసెంబ్లీలో గెలిస్తే ఆయన కాళ్ల వద్ద పడి ఉంటానని వైసీపీ నేత కొడాలి నాని సవాల్ విసిరారు. కుప్పంలో చంద్రబాబు రికార్డు విజయంతో గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది.

Kodali Nani: చంద్రబాబు కాళ్ల వద్ద కొడాలి నాని.. గుంటూరులో ఫ్లెక్సీ..!
kodali nani

గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాంటి సవాళ్లు నడిచాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి గెలవరని.. గెలిస్తే తాము ఏం చేసుకోవడానికైనా సిద్ధమంటూ పెద్ద ఎత్తునే టీడీపీ-వైసీపీ నేతలు ఛాలెంజ్‌లు చేసుకున్నారు. ముఖ్యంగా.. కుప్పం అసెంబ్లీలో బాబు గెలిస్తే.. ఆయన కాళ్ల వద్ద పడి ఉంటానని వైసీపీ నేత కొడాలి నాని (Kodali Nani) సవాల్ విసిరారు. కుప్పంలో చంద్రబాబు రికార్డు విజయంతో గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది కూడా. చంద్రబాబుపై సవాల్ చేసిన కొడాలి నాని మాత్రం ఎక్కడా ఈ ప్రస్తావన తీసుకురాలేదు.. మిన్నకుండిపోయారు. దీంతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ విషయంపై రచ్చ చేసిన టీడీపీ శ్రేణులు ఈసారి ఏకంగా గుంటూరులో ఫ్లెక్సీనే ఏర్పాటు చేసేశారు.

AP Politics: వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి: మంత్రి సత్యకుమార్


kodali.jpg

ఫ్లెక్సీలో ఏముంది..?

ఫ్లెక్సీని నిశితంగా పరిశీలిస్తే.. చంద్రబాబు కాళ్ల వద్ద కొడాలి నాని షూ పాలీష్ చేస్తున్నట్లు ఉంది. ఎన్నికల ముందు చేసిన ఛాలెంజ్ ప్రకారం చంద్రబాబు షూ పాలిస్ చేయాలని అందులో రాసి ఉంది. తెలుగుదేశం కార్యనిర్వహక కార్యదర్శి కనపర్తి పేరుతో ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఛాలెంజ్ చేయడం కాదు, ఓడిపోతే దానిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అటుగా వెళ్తున్న జనం ఆగి మరీ ఫ్లెక్సీ తిలకిస్తున్న పరిస్థితి. సవాల్ చేయడమే కాదు, మాట ప్రకారం చంద్రబాబు కాలి వద్ద పడి ఉండాలని కొందరు.. చంద్రబాబు బూట్లు పాలిష్ చేయాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. జనాలు గుమిగూడి మరీ ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్నారంటే పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.

ఇదే చర్చ..

గుంటూరులో వెలిసిన కొడాలి నాని ఫ్లెక్సీ టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక రేంజిలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను టీడీపీ శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నాయి. కామెంట్స్, కౌంటర్లు అంటారా.. బాబోయ్ ఇక వాటిని మాటల్లో చెప్పక్కర్లేదు. ఇంతవరకూ ఈ వ్యవహారంపై స్పందించని కొడాలి నాని.. ఒకవేళ స్పందిస్తే ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి, అంతకుమించి ఉత్కంఠ నెలకొంది.

AP Politics: వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి: మంత్రి సత్యకుమార్

Narayana: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ.. ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jun 16 , 2024 | 12:05 PM