AP News: కోడికత్తి శ్రీను బెయిల్‌పై విడుదలైన తరువాత మొదటిసారిగా..
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:50 AM
కోడికత్తి శ్రీను, బెయిల్‌పై విడుదలైన తర్వాత మొదటిసారిగా విశాఖలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యాడు. ఎన్ఐఏ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక నాయకుడు బూసి వెంకట్రావు మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి.. ఏదో ఒక కారణం చెప్పి కోర్టుకు హాజరు కావడం లేదన్నారు.
విశాఖపట్నం: కోడికత్తి శ్రీను (Kodi kathi Srinu), బెయిల్‌పై విడుదలైన తర్వాత మొదటిసారిగా విశాఖ (Visakha)లోని సీబీఐ కోర్టు (CBI Court)కు హాజరయ్యాడు. ఎన్ఐఏ కోర్టు (NIA Court) జడ్జ్ సెలవులో ఉండడంతో సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక నాయకుడు బూసి వెంకట్రావు మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) ప్రతిసారి.. ఏదో ఒక కారణం చెప్పి కోర్టుకు హాజరు కావడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి అత్యున్నత విచారణ సంస్థ ఎన్ఐఏ సైతం దీనిలో కుట్ర కోణం లేదని తేల్చి చెప్పిందన్నారు. ఇంకా ఎందుకు వాదనలు కొనసాగిస్తుందో అర్థం కావడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం చేస్తున్నారేమోనని అనుమానంగా ఉందన్నారు. ఈ కేసు నుంచి ఎన్ఐఏ దర్యాప్తు పూర్తయింది కాబట్టి వైదొలగాలని కోరుతున్నామని బూసి వెంకట్రావు తెలిపారు.