Purandareshwari: 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం
ABN , Publish Date - Jan 18 , 2024 | 09:52 AM
అమరావతి: ఈ నెల 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అవుతుందని, రామమందిరం ప్రారంభం భారతీయుల దశాబ్దాల పోరాటం కల నెరవేరబోతోందని, 22న బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.
అమరావతి: ఈ నెల 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అవుతుందని, రామమందిరం ప్రారంభంతో భారతీయుల దశాబ్దాల కల నెరవేరబోతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. 22న బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారని అన్నారు. గురువారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారని, 22వ తేదీన దేశం మొత్తం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదని విమర్శించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వల్ల 21వ తేదీ వరకు సెలవు ఇవ్వడాన్ని బీజేపీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామని పురందేశ్వరి అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి ప్రధాని మోదీ చేయూత ఇచ్చారన్నారు. 22న బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. 21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక ప్రభుత్వం దురుద్దేశం ఉందని అర్థమవుతోందన్నారు. 22న కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయని, అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఏపీ ప్రభుత్వం కూడా 22న సెలవు ప్రకటించాలని పురందేశ్వరి సూచించారు.