Narayana: అదానీని కాపాడుతుంది ఆయనే.. నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Nov 24 , 2024 | 01:44 PM
అమెరికా ప్రభుత్వం ఆదానీపై చర్య తీసుకుంటే అమెరికా నిజాయితీ నిలబడుతుందని, అమెరికా ప్రభుత్వం, నరేంద్ర మోదీ కుమ్మక్యయి ఈ అవినీతి కేసును రూపుమాపాలని ప్రయత్నించడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ కేసు సత్వర పరిష్కారానికి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రావాలని కోరుతున్నామన్నారు.
అమరావతి: అమెరికా (America) దేశంలో న్యూయార్క్ కోర్టులో (New York court) భారతదేశ కార్పొరేట్ దిగ్గజమైన గౌతమ్ అదానీ (Gautam Adani)పై లంచం కేసు నమోదయిందని, భారతదేశంలోలా కాకుండా అమెరికాలో జాప్యం చేయకుండా కేసులను త్వరగా పూర్తి చేస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI National Secretary Narayana) పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. అదానీ అవినీతి పర్వం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పడి ఢిల్లీ వరకు పాకిందన్నారు. అమెరికాలో ఆదానీపై నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోందని, ఈ కేసును అమెరికన్ గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకుంటుందా లేక ఆదానీకి మద్దతుగా మోదీ అడ్డంపడతారా వేచి చూడాలన్నారు.
అమెరికా ప్రభుత్వం ఆదానీపై చర్య తీసుకుంటే అమెరికా నిజాయితీ నిలబడుతుందని, అమెరికా ప్రభుత్వం, నరేంద్ర మోదీ కుమ్మక్యయి ఈ అవినీతి కేసును రూపుమాపాలని ప్రయత్నించడం సరికాదని నారాయణ అన్నారు. ఈ కేసు సత్వర పరిష్కారానికి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రావాలని కోరుతున్నామన్నారు. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అవినీతి అంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. కేవలం రూ.1750 కోట్ల అవినీతికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు లక్ష కోట్ల మూల్యం చెల్లించాలా అని ప్రశ్నించారు. ఆదానీని శిక్షించే శక్తి మోదీకి ఉందా... ఆదానీని శిక్షిస్తే మోదీ పడిపోవడం ఖాయమని అన్నారు. ఇంత అవినీతికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఆదానీకి సపోర్టుగా ఉన్నది ప్రధాని మోదీ అని ఆరోపణలు ఉన్నాయన్నారు. అదానీ అవినీతికి మూల కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలయ్యారని, రాజకీయ, ఆర్థిక అవినీతికి ఆదానీ స్కాం పరాకాష్ట అని.. దీనిపై సమగ్ర విచారణ జరిపి అదానీని, ఇందుకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని నారాయణ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీంకోర్టుకు అదానీ, జగన్ అమెరికా కేసు వ్యవహారం..
తెలంగాణపై కేసీఆర్ చెరగని ముద్ర..: కేటీఆర్
ఆధారాలతో అడ్డంగా బుక్కైన జగన్..
హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News