AP Govt.: అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:51 AM
అమరావతి: ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచింది. శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణలతో అంగన్‌వాడీ నాయకత్వం సమావేశం కానుంది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచింది. శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణలతో అంగన్‌వాడీ నాయకత్వం సమావేశం కానుంది. కాగా ఇప్పటికే రెండు సార్లు అంగన్‌వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈవాల్టి చర్చల్లో అయినా పరిష్కారం లభిస్తుందని, ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందిస్తుందని ఆశాభవంతో అంగన్‌వాడీలు ఉన్నారు.
కాగా సమ్మె విరమించకపోతే అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఐసీడీఎస్ అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఏమాత్రం బెదరకుండా గురువారం 31వ రోజు సమ్మె అంగన్వాడీలు సమ్మె చేశారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి, డిమాండ్లను తీర్చాల్సిన ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తంబళ్లపల్లెలో.. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన ప్రతినిధులు తేల్చి చెప్పారు. తంబళ్లపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారానికి 31వ రోజుకు చేరుకోగా రిలే నిరాహారదీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు తంబళ్లపల్లె మూడు రోడ్ల కూడలిలో సమ్మె శిబిరం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మండలంలోని కోటకొండ, రెడ్డికోటలలో అంగన్వాడీ కేంద్రా లను ఆయా అంగన్వాడీ వర్కర్లు తెరవడానికి ప్రయత్నించారు. విష యం తెలుసుకున్న యూనియన ప్రతినిధులు, అంగన్వాడీలు పెద్దఎత్తు న కేంద్రాల వద్దకు చేరుకుని మూసివేయించారు. కార్యక్రమంలో యూ నియన ప్రతినిధులు కరుణశ్రీ, గౌరి, ఉమాదేవి, సులోచన, సరస్వతి, స్వరూపారాణి, శివమ్మ అంగన్వాడీలు పాల్గొన్నారు.
బి.కొత్తకోటలో.. బి.కొత్తకోట ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వా డీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 31వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా ప్రాజెక్టు యూనియన లీడర్ శ్రీవాణి మా ట్లాడుతూ సమ్మె కీలక దశకు చేరుకున్న సమయంలో మనల్ని చీల్చడా నికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అంగన్వాడీ కార్యకర్తలందరూ మన హక్కుల సాధన కోసం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మూడు మండలాల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో.. కనీస వేతనాలు అడుగుతుంటే ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా అంటూ అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. గురువారం స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో అంగన్వాడీ కార్యకర్తలు గడ్డిని తింటూ వినూత్న రీతిలో నిరస నలు తెలియజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత 31రోజులుగా కనీస వేతనాలు, గ్రాట్యుటీ, తదితర డిమాండ్లు సాధన కోసం సమ్మె చేపడితే సీఎం జగన్మోహనరెడ్డికి చెవికెక్కడం లేదని నినదించారు. ఇప్ప టికైనా ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే సరైన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ యూనియన లీడర్లు చంద్రావతి, భూకైలేశ్వరి, ప్రసన్న, అమ్మాజీ, లక్ష్మీనరసమ్మ, దేవసేన, రెడ్డిరాణి, కలికిరి, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొన్నారు.