Share News

AP Assembly: అసెంబ్లీలో గ్రామవార్డు మహిళా కార్యదర్శులపై చర్చ.. హోంమంత్రి సమాధానం ఇదీ

ABN , Publish Date - Nov 13 , 2024 | 10:17 AM

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా గ్రామ మహిళా కార్యదర్శులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. అలాగే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆన్సర్ ఇచ్చారు.

AP Assembly: అసెంబ్లీలో గ్రామవార్డు మహిళా కార్యదర్శులపై చర్చ.. హోంమంత్రి సమాధానం ఇదీ
AP Assembly budget Session

అమరావతి, నవంబర్ 12: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Speaker Ayyannapatrudu) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మహిళా కార్యదర్శులు విధి నిర్వహణలో స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. వారికి జాబ్ చార్ట్‌పై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, మాధవి రెడ్డి కోరారు.

BRS: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ కీలక నేతలు ఏమన్నారంటే


ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్య వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామ మహిళా కార్యదర్శులకు పోలీస్ డ్రెస్ ఇవ్వాలని వైసీపీ వాళ్ళు చూశారని తెలిపారు. ఎన్‌బీడబ్ల్యూలను ఇంప్లిమెంట్ చేయాలని మహిళా కార్యదర్శులను పంపారన్నారు. వీళ్ళకు నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల పోలీస్ డ్యూటీలు ఇచ్చారని.. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు.


చింతలపూడి ప్రాజెక్టుపై...

nimmala-vasantha.jpg

అంతకు ముందుకు ప్రశ్నత్తరాల్లో భాగంగా చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్ట్‌ పురోగతిపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ఆరు సంవత్సరాలకు ముందు పెట్టిన మొటార్లు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వీటిని వినియోగానికి తేవడానికి రూ.2000 కోట్లు ఖర్చు చేస్తే సాధ్యమవుతోందని వెల్లడించారు.

CM Revanth Reddy: కేసీఆర్‌కు నేను ఫైనాన్స్ చేశా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు


దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ.. నాలుగు జిల్లాలకు సాగు తాగు నీరు అందించేందుకు చింతలపూడి ఎత్తిపోతలను ప్రారంభించారని తెలిపారు. తెలుగుదేశం హయాంలో రూ.3038 కోట్లు ఖర్చు చేసి 40 శాతం పనులు పూర్తిచేశారన్నారు. అయితే 2019-24లో కేవలం రూ.760 కోట్లు ఖర్చు చేసి కేవలం 5 శాతం పనులను మాత్రమే పూర్తయ్యాయన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ఆలస్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

Updated Date - Nov 13 , 2024 | 10:27 AM