Share News

CM Chandrababu: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం...

ABN , Publish Date - Dec 12 , 2024 | 11:59 AM

రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు.

CM Chandrababu: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం...

అమరావతి: ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సోషల్ మీడియా (Social Media) వేదికగా ట్వీట్ (Tweet) చేశారు. ‘‘రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది.. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు.. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు నేను, నా మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నాం.. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం.. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం.. ‘రాష్ట్రమే ఫస్ట్... ప్రజలే ఫైనల్' అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నాం.. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి.. ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో... స్వర్ణాంధ్ర - 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ 1 గా నిలబెడతాం..’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.


కాగా వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ రెండో రోజు గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా పీపంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పెన్షన్‌లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు శశిభూషన్ కుమార్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 6 లక్షల మందికి హడావుడిగా పెన్షన్లు ఇచ్చారని... ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించిన మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.


కలెక్టర్లపై సీఎం ఆగ్రహం...

గ్రామీణ ఉపాధి హామీ పథకం డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహించాల్సిన కార్యక్రమం అని పేర్కొన్నారు. వందరోజులు పనిదినాలను సరిగా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్‌ను పూర్తి చేయలేక పోతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. పల్లె పండుగలో 14.8 పర్సెంట్ మాత్రమే పనులు చేశారని ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉందన్నారు. అల్లూరి జిల్లాలో 54 శాతం పూర్తైతే మరో జిల్లాలో 1.6 శాతం మాత్రమే పనులు జరగటంపై చంద్రబాబు ప్రశ్నించారు. పని పూర్తైన వెంటనే బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని అడిగారు. కలెక్టర్‌లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ల వద్ద ఉపాధి హామీ డబ్బులు ఉన్నా బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని ఆగ్రహించారు. జలజీవన్ మిషన్‌ను గత ప్రభుత్వం మొత్తం దెబ్బ తీసిందని వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించామన్నారు. గ్రామాల్లో కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎందుకు రాజీనామా చేశానంటే..: అవంతి శ్రీనివాస్

ప్రేమ కోసం మతం మార్చుకున్నా.. అయినా..

ప్రపంచ రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్

‘స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్’...

కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 12 , 2024 | 11:59 AM