CM Chandrababu: సతీసమేతంగా దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 09 , 2024 | 03:17 PM
Andhrapradesh: దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ అర్చకులు , దేవాదాయశాఖ మంత్రి ఆనం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం చంద్రబాబు తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు. ఆపై మేళతాళాల నడుమ ప్రభుత్వం తరపున దుర్గమ్మకు సతీసమేతంగా సీఎం పట్టువస్త్రాలను సమర్పించారు.
విజయవాడ, అక్టోబర్ 9: దేవీనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. బుధవారం ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం.. ముందుగా ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఇటీవల వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పరిసరాల్లో దెబ్బతిన్న ప్రాంతాలు, పునరుద్ధరణ తర్వాత ఫోటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు.
Anitha: ఫేసు టు ఫేస్ కూర్చుందాం రండి.. వైసీపీకి అనిత సవాల్
అనంతరం ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు , దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం చంద్రబాబు తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు. ఆపై మేళతాళాల నడుమ ప్రభుత్వం తరపున దుర్గమ్మకు సతీసమేతంగా సీఎం పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం సరస్వతీ అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు దుర్గమ్మను మంత్రులు నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుజన చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈఓ కేఎస్ రామారావు, దేవాదాయ శాఖ అధికారులు దర్శించుకున్నారు.
Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్
వైభవంగా ఉత్సవాలు...
కాగా.. ఇంద్రకీలాద్రిపై దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. సరస్వతి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రాత్రి ఒంటిగంట నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఉత్సవాల సందర్భంగా అన్ని టిక్కెట్లు రద్దు చేసి, అన్ని క్యూలైన్లలో ఉచితంగా దర్శనం కల్పించారు. అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అలాగే ఈరోజు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. కూమార్తె ఆద్యతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో డిప్యటీ సీఎంకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చూడగానే భక్తులలో ఉత్సాహం ఉరకలేసింది. జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.
అలాగే హోం మంత్రి వంగలపూడి అనిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నానని.. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు అన్నీ పరిశీలించినట్లు తెలిపారు. క్యూ లైన్లో భక్తులతో కూడా మాట్లాడానని.. అందరూ ఏర్పాట్లు బాగున్నాయని ఆనందాన్ని వ్యక్తపరిచారని తెలిపారు. భవానీలకు సంబంధించి ప్రత్యేకమైన క్యూలైన్ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. సామాన్య భక్తులకు పెద్దపీఠం వేయడం కోసం అంతరాలయ దర్శనాన్ని ఈరోజు నిలిపివేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా బంగారపు వాకిలిలోనే దర్శనం చేసుకొని వెళుతున్నారని హోంమంత్రి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Anitha: దుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి అనిత
Anitha: ఫేసు టు ఫేస్ కూర్చుందాం రండి.. వైసీపీకి అనిత సవాల్
Read Latest AP News And Telugu News