Share News

CM Chandrababu: నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చంద్రబాబు సమీక్ష..

ABN , Publish Date - Oct 12 , 2024 | 12:58 PM

నిత్యావసర వస్తువల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సీఎం సమీక్షించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర వస్తువల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిమాండ్‌కు తగిన విధంగా నిత్యావసర వస్తువల..

CM Chandrababu: నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చంద్రబాబు సమీక్ష..
Chandrababu Naidu

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిత్యావసర ధరల నియంత్రణపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు ఫౌరసరఫరాల శాఖపై ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఫౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సీఎం సమీక్షించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర వస్తువల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిమాండ్‌కు తగిన విధంగా నిత్యావసర వస్తువల దిగుమతి, ధరల నియంత్రణకు దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రస్తుతం రైతు బజార్ల ద్వారా చేపట్టిన అమ్మకాలు, కౌంటర్ల ఏర్పాటు తదితర విషయాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.

Also Read: మౌనం వీడండి.. హిందువులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు


భారీగా పెరిగిన నిత్యావసర ధరలు..

గత కొద్దిరోజులుగా నిత్యావసర ధరల వస్తువులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలు విపరీతంగా పెరగడమే కాకుండా మార్కెట్ స్టాక్ పరిమితంగానే ఉంది. దీంతో వంటనూనెకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. సూపర్ మార్కెట్లో సైతం వంట నూనె ధరలు అధికంగా ఉన్నాయి. రెండు నెలల క్రితం వంద నుంచి 110 రూపాయిల మధ్య ఉన్న ఆయిల్ ప్యాకెట్ ధర.. ప్రస్తుతం 140 రూపాయిలు దాటింది. ఆన్‌లైన్ డెలీవరీ యాప్స్‌లో కూడా వంట నూనె అందుబాటులో లేదు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్‌లో సన్ ఫ్లవర్ ఆయిల్ స్టాక్ లేదు. మరోవైపు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి.

Also Read: పెద్దమ్మ తల్లి దేవాలయానికి పోటెత్తిన భక్తులు: నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు


ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు..

భారీగా పెరిగిన నిత్యావసర ధరలపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ ధరల భారం అధికంగా ఉండటంతో ప్రభుత్వం వెంటనే ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఈలోపు రైతు బజార్లలో తక్కువ ధరకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిమాండ్ అధికంగా ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు బహిరంగ మార్కెట్‌లో అధికంగా ఉండటంతో రైతు బజార్లలో అందరికీ అందుబాటు ధరల్లో విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Also Read: సొంతిల్లు కావాలంటే.. ఇలా చేయండి చాలు..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 12 , 2024 | 12:58 PM