Share News

AP HighCourt: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు.. హైకోర్టులో వైసీపీ నేతకు షాక్

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:24 PM

Andhrapradesh: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ హత్య కేసులో వైసీపీ తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈరోజు (మంగళవారం) బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణకు వచ్చింది.

AP HighCourt: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు.. హైకోర్టులో వైసీపీ నేతకు షాక్
AP High court

అమరావతి, నవంబర్ 5: ఆంధ్రజ్యోతి (ABn Andhrajyothy) విలేఖరి హత్య కేసులో వైసీపీ నేతకు హైకోర్టు షాకిచ్చింది. ఈ హత్య కేసులో వైసీపీ తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా (YSRCP Leader Dadishetty Raja) ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈరోజు (మంగళవారం) బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

TG News: హైదరాబాద్‌లో దారుణం


కాగా... 2020లో ఆంధ్రజ్యోతి తుని రూరల్ విలేఖరి కే సత్యనారాయణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ హత్యలో మాజీ ఎమ్మెల్యే దాడిసెట్టి రాజా ప్రమేయం ఉందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేపై కేసు లేకుండా చేశారు పోలీసులు. దీనిపై న్యాయవాది అయిన సత్యనారాయణ సోదరుడు.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రాజా ప్రమేయం ఉందని కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్‌లో రాజా పిటిషన్ వేశారు.

Rs 2000 Notes: ఇప్పటికీ ప్రజల దగ్గరే రూ.6970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన..


అసలేం జరిగిందంటే..

కె. సత్యనారాయణ... తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేఖరిగా పనిచేశారు. ఈ క్రమంలో 2020లో సత్యనారాయణను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. విధులు ముగించుకుని రాత్రి సమయంలో ఎస్‌. అన్నవరంలోని ఇంటికి బైక్‌పై వెళ్తుండగా.. లక్ష్మీదేవి చెరువుగట్టుపై కొందరు వ్యక్తులు అడ్డగించి దాడి చేశారు. తమతో తెచ్చిన కత్తులతో సత్యనారాయణపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడిక్కడకే మృతి చెందాడు. అయితే సత్యనారాయణ హత్యకు వైసీపీ నేత దాడిశెట్టి రాజానే కారణమని కుటుంబీకులు ఆరోపించారు. దీంతో దాడిశెట్టి రాజా సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


కాగా.. వైసీపీ హయాంలో దాడి శెట్టి రాజా మంత్రి అవడంతో కేసు ముందుకు సాగలేదు. 2023లో దాఖలైన చార్జిషీట్‌లోనూ దాడిశెట్టి రాజా పేరును తప్పించేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి సత్యానారయణ సోదరుడు, న్యాయవాది కాతా గోపాలకృష్ణ తీవ్రంగా పోరాడుతున్నారు. తమకు న్యాయం చేయాలని.. దాడిశెట్టి రాజాపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్‌ కోసం రాజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.


ఇవి కూడా చదవండి..

Nagula chavithi: విజయవాడలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 12:30 PM