Share News

Anagani: అది పిచ్చి తుగ్లక్ జగన్‌కే చెల్లుతుంది..

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:21 PM

Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీ ర్యాలీపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్ర విద్యుత్ రంగంపై దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిన జగన్ ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు. యూనిట్‌‌కు ఐదు రూపాయలకు దొరికే విద్యుత్‌కు బదులు 8 నుంచి 14 రూపాయల వరకు కొనుగోలు చేసి ప్రజలపైన జగన్ రెడ్డి మోయలేని భారాన్ని మోపారన్నారు.

Anagani: అది పిచ్చి తుగ్లక్ జగన్‌కే చెల్లుతుంది..
AP Ministers And MLAs

అమరావతి, డిసెంబర్ 27: రాష్ట్రంలో కరెంట్ చార్జీల పెంపుపై వైసీపీ చేస్తున్న ధర్నాపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలనే నిరసన చేయడం సిగ్గు చేటు అంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anaganai Satyaprasad) మాట్లాడుతూ.. తన పాలనలో రాష్ట్ర విద్యుత్ రంగంపై దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిన జగన్ ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. యూనిట్‌‌కు ఐదు రూపాయలకు దొరికే విద్యుత్‌కు బదులు 8 నుంచి 14 రూపాయల వరకు కొనుగోలు చేసి ప్రజలపైన జగన్ రెడ్డి మోయలేని భారాన్ని మోపారన్నారు. సోలార్, విండ్ ఎనర్జీ పీపీఎలను రద్దు చేసి రాష్ట్రానికి 10 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును జగన్ అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు.


2022 నుంచి 2024 వరకు రెండేళ్ల కాలానికి రూ.17 వేల కోట్ల ట్రూఅప్ ఛార్జీలను పెంచాలని అనాడే జగన్ సర్కార్ ఆమోదించిందన్నారు. ఆ ట్రూ అప్ ఛార్జీలనే రెండేళ్ల పాటు పెంచకుండా ప్రస్తుతం డిసెంబర్ నుంచి అమలు చేయాలంటూ ఈఆర్సీ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. తాను పెంచాలని సూచించిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా తానే పోరాటం చేయడం పిచ్చి తుగ్లక్ జగన్‌కు మాత్రమే చెల్లిందంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ విరుచుకుపడ్డారు.


జగన్ కొత్త డ్రామాలకు తెర: ప్రత్తిపాటి

Prathipati-Pullarao-1.jpg

పల్నాడు జిల్లా: ప్రజల చేతిలో క్షవరం అయినా జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు తత్వం బోధపడలేదని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా జగన్ రెడ్డి, అతడి టీమ్ పద్దతి మార్చుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రజల మద్ధతు చూసి ఓర్వలేక జగన్ కొత్త డ్రామాలకు తెరలేపారన్నారు. ప్రస్తుతం ప్రజలపై పడిన విద్యుత్ చార్జీల భారం జగన్ అవినీతి , అత్యాశల వల్లే అని వ్యాఖ్యలు చేశారు. తన పాలనలో జగన్ రాష్ట్ర విద్యుత్ రంగానికి చేసిన నష్టం రూ. 1,29,503 కోట్లు అని తెలిపారు. ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల నడ్డివిరిచి మరీ జగన్ రూ.32,166 కోట్లు. దండుకున్నారన్నారు. తన పాలనలో జగన్ విద్యుత్ సంస్థలపై వేసిన అప్పులే రూ. 50 వేల కోట్లు అని తెలిపారు. అస్తవ్యస్త నిర్ణయాలు, అవినీతి అత్యాశతో రాష్ట్రాన్ని, విద్యుత్ రంగాన్ని నాశనం చేసిన ఘనత జగన్ దే అంటూ ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు చేశారు.


చంద్రబాబుకు ఏ సంబంధం లేదు: కాల్వ శ్రీనివాసులు

kaluva.jpg

అనంతపురం: కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ ఓర్వటం లేదని రాయదుర్గం ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. మొన్న రైతు కోసం, ఇవాళ కరెంట్ చార్జీల పెంపుపై ర్యాలీ హాస్యాస్పదంగా ఉందన్నారు. కరెంట్ చార్జీల పెంపునకు చంద్రబాబుకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాపాలే ఇవాళ ఛార్జీలు పెంపు పరిస్థితికి కారణమని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వమే విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలు ఇచ్చారని.. విద్యుత్ రంగాన్ని స్వార్థపూరిత ఆలోచలతో నాశనం చేశారన్నారు. అస్తవ్యస్త పాలనతో ప్రజలపై భారం మోపారని తెలిపారు. వైసీపీ చేసిన మోసానికి ఇవాళ వారే ర్యాలీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెడుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రజా సమస్యలపై మాట్లాడే అర్హత లేదన్నారు. వైసీపీ ఆది నుంచి అసత్యాలు ప్రచారం చేస్తోందని.. దీన్ని ప్రజలు గమనించాలన్నారు. జగన్ పాపాలు కడిగేస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా.. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా తీసుకొస్తుందని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Fake Currency: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం

గుర్తుపెట్టుకోండి.. జనవరి 1 నుంచి మారేవి ఇవే..

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 27 , 2024 | 01:58 PM