YS Sharmila: విశాఖ స్టీల్‌ను మోదీ దోస్తులకు అమ్మే కుట్ర.. షర్మిల సంచలన కామెంట్స్
ABN , Publish Date - Dec 26 , 2024 | 02:30 PM
Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మలా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ ప్రధాని మోదీకి ఆంధ్రుల హక్కు మీద లేదన్నారు. విశాఖ స్టీల్‌ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయన్నారు. మోదీ దోస్తులకు పదో పరక కింద అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు.
విజయవాడ, డిసెంబర్ 26: విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే అని ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనే అంటూ వ్యాఖ్యలు చేశారు. కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ ప్రధాని మోదీకి (PM Modi) ఆంధ్రుల హక్కు మీద లేదన్నారు. విశాఖ స్టీల్‌ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయన్నారు. మోదీ దోస్తులకు పదో పరక కింద అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా ప్లాంట్‌ను చంపేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉందని విరుచుకుపడ్డారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కు రూ.15 వేల కోట్ల సహాయం అందించి.. స్టీల్ ప్లాంట్‌ను బ్రతికించారని తెలిపారు.
243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రానికి.. 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్‌ను ఆదుకోవడానికి మనసు లేదన్నారు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిథ్యం ఉండే జేడీ(ఎస్) రూ.15వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే.. ఎన్‌డీఏకు ఊపిరి పోసిన టీడీపీ- జనసేన పార్టీలు మోదీకి సలాం కొడుతున్నాయని మండిపడ్డారు. 18 మంది ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారని అన్నారు. ఇది నిజంగా సిగ్గు చేటని.. ఏపీ ఎంపీల అసమర్ధతకు నిదర్శనమని దుయ్యబట్టారు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ముడిసరుకు కొరతతో ఉత్పత్తి తగ్గిందని, ప్లాంట్ దివాలా తీసే స్థాయిలో ఉందని, కేంద్రం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవాలని కార్మికులు 1400 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రధాని మోదీతో మిట్టల్ స్టీల్ గురించి చర్చ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఇకపై నో బెనిఫిట్ షోలు.. తేల్చి చెప్పిన సీఎం..
మిట్టల్ పెట్టబోయే ప్లాంట్‌కు ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడలట.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల ఆర్థిక సహాయం ఇచ్చినట్లే.. వైజాగ్ స్టీల్‌కు కేంద్రం నిధులు ఇవ్వాలని.. ప్లాంట్‌ను ఎస్‌ఏఐఎల్‌లో వెంటనే విలీనం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రారంభించాలన్నారు. భవిష్యత్‌లో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని తెలిపారు. ఇవి సాధించడం చేతకాకపోతే వెంటనే ఎన్‌డీఏ భాగస్వామ్యం నుంచి టీడీపీ, జనసేనలు తప్పుకోవాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
సీఎంతో సమావేశం.. కింగ్ నాగార్జున ప్రతిపాదనలివే..
Viral: బ్రిటన్‌లో ఉండలేనంటూ తిరిగొచ్చిన భారతీయ డాక్టర్! కారణం తెలిస్తే..
Read Latest AP News And Telugu News