Share News

అమరావతి: APMDC మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్ట్

ABN , Publish Date - Sep 27 , 2024 | 07:14 AM

వెంకటరెడ్డి పట్టుబడ్డారా లేక లొంగిపోయారా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే పెద్ద ప్రశ్న. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. వెంకట రెడ్డిని శుక్రవారం వేకువజామున బెజవాడకు తీసుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నంలోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

అమరావతి: APMDC మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్ట్

ఏసీబీకి చిక్కిన గనుల తిమింగలం

హైదరాబాద్‌లో అదుపులోకి..

ధ్రువీకరించిన ఏసీబీ అధికారులు

నేడు బెజవాడ కోర్టుకు మాజీ డైరెక్టర్‌

లొంగుబాటా.. అరెస్టా? అనే అనుమానాలు

అమరావతి: ఏపీఎండీసీ (APMDC) మాజీ ఎండీ (Ex MD) వెంకట రెడ్డి (Venkatreddy)ని ఏసీబీ (ACB) అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం విజయవాడ (Vijayawada) ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరు పరిచే అవకాశం ఉంది. ఇప్పటికే వెంకట రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వెంకట రెడ్డి చర్యలు వలన ప్రభుత్వానికి 2 వేల 566 కోట్ల రూపాయలు మేర ఆదాయానికి గండి పండిందని అధికారులు పేర్కొన్నారు. వెంకట రెడ్డి లొంగి పోయారని కొంతమంది అధికారులు చెబుతున్నారు. కాగా అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు నిర్ధారించారు.


వెంకటరెడ్డి పట్టుబడ్డారా లేక లొంగిపోయారా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే పెద్ద ప్రశ్న. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. వెంకట రెడ్డిని శుక్రవారం వేకువజామున బెజవాడకు తీసుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నంలోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన స్టాఫ్‌ ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగి. రాష్ట్రంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ అడుగు పెట్టారు. పంచభూతాల్లో ఒకటైన ఇసుక, మైనింగ్‌ జగన్‌ అనుయాయులకు దోచిపెట్టారు. ఇసుక టెండర్లు పాడుకున్న జేపీ వెంచర్స్‌తో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 800కోట్లు ప్రత్యక్షంగా నష్టం చేకూర్చారు. బయటికి కనిపించకుండా వేలకోట్ల రూపాయల సంపద దోపిడీకి సహకరించిన వెంకట రెడ్డి, అందులో సింహ భాగం తాడేపల్లి ప్యాలెస్‌కు చేర్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ సర్కారు ఏర్పడటంతో అక్రమాల నిగ్గు తేల్చే ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమిక నివేదిక తెప్పించుకుని ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది.


ఆగస్టు 31న కేసు నమోదు చేసిన ఏసీబీ....కడప, తిరుపతి, విజయవాడతోపాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో గాలించింది. అయితే ప్రభుత్వం మారగానే విదేశాలకు పారిపోయినట్లు వార్తలు రావడంతో ఆదిశగా ఏసీబీ నిఘా పెట్టింది. ఇదే సమయంలో వెంకట రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించగా అప్రమత్తమైన ఏసీబీ... ఆయనకు బెయిల్‌ రాకుండా అడ్డుపడింది. దిక్కుతోచని వెంకట రెడ్డి మధ్యవర్తుల ద్వారా ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు సమాచారం. మర్యాదగా లొంగిపోయి విచారణకు సహకరిస్తే తాము కఠినంగా వ్యవహరించబోమని, అలా కాకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తే తమదైన శైలిలో చర్యలుంటాయని వారు హెచ్చరించారు. దీంతో వెంకటరెడ్డి ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.


కాగా మాజీ సీఎం జగన్ అండతో గనులశాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకున్న అప్పటి డైరెక్టర్ వెంకట్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. కుట్ర, అవినీతి, దోపిడీ కేసులో తొలి నిందితుడు.. ఏ1గా వెంకట్ రెడ్డి పేరును చేర్చింది. మరో ముగ్గిరిపై కూడా కేసు నమోదైంది. వారిలో గనులశాఖలో మరో కీలక అధికారి పేరు ఉన్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

21 మంది పిల్లలపై అత్యాచారం..

జగన్‌ గో బ్యాక్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 27 , 2024 | 07:40 AM