Share News

AP News: కొడాలి నాని అనుచరుల వరుస అరెస్టులు..

ABN , Publish Date - Dec 04 , 2024 | 12:38 PM

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.. ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు.. టీడీపీ కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా గుడివాడ వైఎస్సార్‌సీపీ నేత, మాజీమంత్రి కొడాలి నాని అనుచరులను పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు.

 AP News: కొడాలి నాని అనుచరుల వరుస అరెస్టులు..

కృష్ణా జిల్లా: గుడివాడ వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leaders), మాజీమంత్రి కొడాలి నాని (Ex CM Kodali Nani) అనుచరులను (Followers) పోలీసులు (Police) వరుస అరెస్టులు (Arrests) చేస్తున్నారు. అధికారంలో ఉండగా చేసినా అరాచకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. 9 మంది వైఎస్సార్‌సీపీ యువ నేతలను అరెస్టు చేసిన గుడివాడ 1 టౌన్ పోలీసులు.. పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2022 డిసెంబర్ 25న.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి అరాచకం సృష్టించారు. ఈ కేసులో 143, 144, 145,188, 427, 506, రెడ్ విత్ 149 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గడ్డం గ్యాంగ్ మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నాడు. అస్సాం రాష్ట్రానికి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందంతో గాలింపుచర్యలు చేపట్టారు. అధికారంలో ఉండగా చేసినా అరాచకాలపై.. నమోదైన కేసులను పోలీసులు తిరగతోడుతున్నారు. వరుస అరెస్టులతో..వైఎస్సార్‌సీపీ అరాచక వాదుల వెన్నులో వణుకు మొదలైంది.


వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.. ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు.. టీడీపీ కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు కోకొల్లలు. సీన్ కట్ చేస్తే.. ఐదంటే ఐదేళ్లలో టీడీపీ కూటమి (NDA Alliance) అధికారంలోకి రావడంతో నాడు ఓవరాక్షన్ చేసి విర్రవీగిన ఒక్కొక్కరి తాట తీస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది.. ఒక్కొ ఘటన గుర్తుకు తెచ్చుకుని మరీ.. పాత విషయాలన్నీ బయటికి తీసి వైసీపీ నేతలకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయం, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతుండగా.. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారం బయటి తీశారు. దీంతో గుడివాడ వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది... మాజీ మంత్రి కొడాలి నాని టార్గెట్‌గా ఏపీ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


ఏం జరిగింది..

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడుల, పెట్టిన కేసుల తాలూకా ఒక్కొక్కటికి బయటికి తీస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు. వైసీపీ అధికారంలోకి ఉండగా కొడాలి నాని, ఆయన అనుచరులు, స్థానిక నేతలు.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావును ఎంతలా ఇబ్బంది పెట్టారో అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా.. వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనరాదని రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి మరీ వైసీపీ నేతలు బెదిరించారు. ఆఖరికి.. డిసెంబర్-25, 2022లో టీడీపీ కార్యాలయంలో ఉన్న రావి, ఇతర టీడీపీ నేతలపై కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. అయితే ఇంత జరుగుతున్నా ‘మాకేమీ పట్టదు’ అన్నట్లుగా పూర్తిగా వైసీపీ నేతలకే సీఐ గోవిందరాజులు అండ్ కో కొమ్ముకాశారు.

ఇప్పుడు టీడీపీ వంతు..

నాడు వైసీపీ అధికారంలో ఉండగా మా వంతు అని విర్రవీగిన నేతలకు.. ఇప్పుడిక కూటమి వంతు వచ్చేసరికి వరుసబెడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. గన్నవరంలో దాడి తాలుకూ వీడియో ఫుటేజ్ ఆధారంగా నాటి దాడులపై వైసీపీ నేతలు మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్‌లతో పాటు మరో ఇరవై మందిపై 143,144,146,188,427,506 R/W 149 BNS కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మరోవైపు.. కే కన్వెన్షన్‌లో జరిగిన క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైనా పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. కొడాలి నాని క్యాసినో వ్యవహారంపై 2022, జనవరి 21న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపై దాడులు జరిగిన అందరికీ తెలిసిందే. కార్లు ధ్వంసం, గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం ఘటనలలో నాడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్, కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే.. కొడాలి నాని టార్గెట్‌గా చర్యలకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నానిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఊరి నిండా సమాధులే.. వింత గ్రామం..

జగన్ బంధువుల్లో నోటీసుల కలకలం..

రాజధాని నివాసిగా ఏపీ సీఎం చంద్రబాబు

కోహ్లీకి గాయం.. రెండో టెస్ట్‌కు డౌట్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 04 , 2024 | 12:38 PM