Share News

CM Chandrababu: కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉంది..

ABN , Publish Date - Jul 24 , 2024 | 07:08 AM

అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉందని, ఇది ప్రగతిశీల బడ్జెట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జె‌ట్‌పై తనను కలిసిన మీడియాతో సీఎం కొద్దిసేపు చిట్ చాట్‌గా మాట్లాడారు.

CM Chandrababu: కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉంది..

అమరావతి: కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ (Budget) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉందని, ఇది ప్రగతిశీల బడ్జెట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జె‌ట్‌పై తనను కలిసిన మీడియాతో సీఎం కొద్దిసేపు చిట్ చాట్‌గా మాట్లాడారు. తన ఢిల్లీ పర్యటనల సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కేంద్రం ముందు ఉంచిన ప్రతిపాదనలు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి నిధులు ప్రకటించడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయని వెల్లడించారు.


కేంద్రం అండగా ఉంది అనే భావనతో యాక్టివిటీ మరింత పెరుగుతుందని...ఈ కారణంగా రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం లభిస్తుందని, నిధులు ఏ రూపేణా వచ్చినా, అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం వేగం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. వివిధ ఏజన్సీల ద్వారా వచ్చే అప్పులకు కేంద్రం పూచీకత్తు ఇస్తుందన్నారు. వీటికి అదనంగా మరి కొంత గ్రాంట్ కూడా వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ ఏడాది ఇంత మేర నిధులు అని పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం ప్రకటించడం సంతోషమన్నారు. ఇది మంచి పరిణామమని, మనం కోరుకుంది కూడా ఇదేనని ఆయన అన్నారు.


వెనుకబడి జిల్లాలకు ఇచ్చే సాయం బుందేల్ ఖండ్ ప్యాకేజి తరహాలో ఉంటుందని భావిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్యాకేజీలో పారిశ్రామిక రాయితీలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ప్రధాని మోదీకి ఎక్స్ ద్వారా సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ప్రకటించిన సాయం రాష్ట్ర పునర్ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రగతి శీల, కాన్ఫిడెన్స్ పెంచే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ప్రధానికి, కేంద్రానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.


కాగా మోదీ ప్రభుత్వం (Modi Govt.,) మిత్రధర్మాన్ని చాటుకుంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ-జనసేన మద్దతే కీలకం కావడంతో.. తాజా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంపై వరాల జల్లు కురిపించింది. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, పారిశ్రామికాభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇబ్బడిముబ్బడిగా సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్రకటించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కర్తవ్యంలో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా రాష్ట్రానికి రాజధాని ఉండాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఈ ఏడాదే ఈ నిధులు అందిస్తామని చెప్పారు. రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులు కూడా సమకూరుస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ హ్యాపీ..

పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 24 , 2024 | 07:12 AM