Share News

CM Chandrababu: గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని....

ABN , Publish Date - Nov 26 , 2024 | 02:03 PM

గత అయిదేళ్లు మర్చిపోదాం అనుకున్నా.. అందరికి గుర్తుండాలని.. నాల్గవ సారి సీఎం అయినా ఇంకా పూర్తిగా విద్వంసానికి గురయిన వ్యవస్ధను కాపాడడం కష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రాధమిక హక్కులు కాలరాశారని విమర్శించారు. రాజ్యాంగంలోని జరిగిన తప్పిదాలు వల్ల కొన్ని దశాబ్దాలు ఇబ్బంది పడతామని ఆయన పేర్కొన్నారు.

CM Chandrababu: గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని....

అమరావతి: రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో ఆమోదించన రోజుని.. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) ఆధ్వర్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులుపాటు రాసిన రాజ్యాంగం మనదని.. రాజ్యాంగం అములు చేసి 75 సంవత్సరాలు అయినా సవాళ్లను అధిగమించి ముందుకు వెళుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగిన 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో (75th Constitution Day) పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు, జనవరి 26ను జరుపుకుంటున్నామని, అయితే రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును కూడా పాటించాలని అన్నారు. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు అందరికి పవిత్రమయిన గ్రంధం ఇదని పేర్కొన్నారు.


ప్రపంచంలో ఉండే అన్ని దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అందులోని బెస్ట్ ప్రాక్టిస్ తీసుకుని దేశానికి రాజ్యాంగం తయారు చేశారని, భవిష్యత్తు సవాళ్లను కూడా ఊహించి రాజ్యాంగంలో పరిష్కారాలు చూపారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ నుంచి 11మంది రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. సాంఘిక, ఆర్ధిక , రాజకీయ న్యాయాన్ని ఆరోజే కల్పించేలా రాజ్యాంగంలో ఉంచారని, అంతస్ధు, అవకాశాలలోనూ సమానత్వంపై ప్రయత్నం చేయాలన్నారు. ఈ రాజ్యాంగాన్ని భారత పౌరులుగా మనకు మనం సమర్పించుకుంటున్నట్టు రాసారన్నారు. ఎంతమంచి రాజ్యాంగం ఉన్నా.. అమలు చేస్తున్న వారు చెడ్డవారైతే రాజ్యాంగం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ఎంత చెడ్డ రాజ్యాంగం ఉన్నా అమలు పరిచే వ్యక్తులు మంచి వారైతే దాని వల్ల మంచే జరగుతుందన్నారు. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే దాన్ని కరెక్టు చేసే శక్తి ఓటర్లకు ఉందన్నారు. ఎవ్వరు అయినా రాజ్యంగాన్ని అతిక్రమించినా రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసినా అది రాజ్యాంగ ఉల్లంఘనేనని, గత అయిదేళ్లుగా ఏపీలో కూడా అనేక ఇబ్బందులు వచ్చాయని, రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రాధమిక హక్కులు కాలరాశారని విమర్శించారు. రాజ్యాంగంలోని జరిగిన తప్పిదాలు వల్ల కొన్ని దశాబ్దాలు ఇబ్బంది పడతామని చంద్రబాబు పేర్కొన్నారు.


ఆర్ధిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిందని.. అయితే ఆ సంపద కిందిస్ధాయి వారి వరకూ తీసుకువెళ్లగలగాలనే ఉద్దేశంతో 1991లో ఆర్ధక సంస్కరణలు ప్రారంభించామని సంపద దీని వల్ల పుడుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. జీరో పవర్టీ కోసం పంపదను ఉపయోగించుకోవడం అవసరమని, టెక్నాలజీ వల్ల ఆర్ధిక సృష్టి ఈజీ అయ్యిందని.. దీనికి డెమెక్రాటిక్ డివిడెంట్ అడ్వాంటెజ్‌గా ఉందని సీఎం అన్నారు. గత అయిదేళ్లు మర్చిపోదాం అనుకున్నా.. అందరికి గుర్తుండాలని.. నాల్గవ సారి సీఎం అయినా ఇంకా పూర్తిగా విద్వంసానికి గురయిన వ్యవస్ధను కాపాడడం కష్టంగా ఉందన్నారు. గతంలో ఎక్కువ సమయం పనిచేయాల్సి వచ్చిందని... ఇప్పడు ఎక్కవ పని కాకుండా స్మార్ట్ వర్కు చేయాలని.. అందుకే సాయంత్రం 6 గంటల తరువాత మీటింగులను వీలున్నంత వరకూ తగ్గిస్తానని చంద్రబాబు చెప్పారు. చిన్న పిల్లలకు కూడా రాజ్యాంగం పట్ల అవగాహన రావాలని.. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు అందరం దేవుడిని ప్రార్ధిస్తామని.. అయితే రాజ్యాంగాన్ని గౌరవించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, ఐఏఎస్‌లు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దెబ్బతిన్న హైదరాబాదీ బిర్యానీ బ్రాండ్ ఇమేజ్..

పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు

ఢిల్లీలో పవన్ కల్యాణ్ బిజీ బిజీ..

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు

శైలజ మృతి పై ఆందోళన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 26 , 2024 | 02:03 PM