CM Chandrababu: తూర్పుగోదావరి జిల్లా ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
ABN , Publish Date - Nov 04 , 2024 | 10:12 AM
Andhrapradesh: తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరెంట్ షాక్‌తో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
అమరావతి, నవంబర్ 4: తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీ కడుతూ వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అనే నలుగురు మృతి చెందడంపై సీఎం ఆవేదన చెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు.
Gold and Silver Rates Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలంటూ సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: వాసంశెట్టి
కోనసీమ జిల్లా: విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో విద్యుదాఘాతంతో నలుగురు మృతి అత్యంత బాధాకరమన్నారు. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదం చోటు చేసుకున్న ప్రమాదం కలచి వేసిందన్నారు. ప్రమాదంలో మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు.
అన్ని విధాలుగా ఆదుకుంటాం: నిమ్మల
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుదాఘాత మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా కేటీఆర్ సంచలన ట్వీట్లు..
YSRCP: మీ ఫ్యామిలీ మొత్తాన్నీ లేపేస్తాం
Read Latest AP News And Telugu News