Share News

Chandrababu: వరద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:26 PM

వరద సహాయ కార్యక్రమంలో అధికారులు మంత్రులు ఒక స్పిరిట్‌తో పనిచేశారని, ఇంత పెద్ద ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది 10 -11 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. వరద నీటిలో ఉన్న బాధితులకు అన్ని రకాలూగా సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు.

Chandrababu: వరద బాధితులకు పరిహారం అందజేసిన  సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బుధవారం విజయవాడ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. వరద బాధితులకు (Flood victims) నష్టపరిహారం (Compensation) పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం తన చేతుల మీదగా పలువురికి నష్టపరిహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు (Ministers) కూడా పాల్గొన్నారు. సహాయక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అధికారుల సమీక్ష సమావేశల్లో కంటే వరద సహాయక కార్యక్రమాలలోనే ఎక్కువ సమయం వెచ్చించానని.. 400 వందల కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి వచ్చాయని.. వరద సహాయ కార్యక్రమంలో అధికారులు మంత్రులు ఒక స్పిరిట్‌తో పనిచేశారని, ఇంత పెద్ద ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది 10 -11 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. వరద నీటిలో ఉన్న బాధితులకు అన్ని రకాలుగా సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు. ఇంత పెద్ద విపత్తులో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయని, ఆఖరు బాధితుడికి కూడా సాయం అందలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి నేరుగా నష్టపరిహారం సొమ్మును ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల ఖాతాల్లో జమచేశారు. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ కానున్నాయి. వరదలతో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపులు కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగినవారికి రూ. 25వేలు, మొదటి.. ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ. 10 వేలు, దుకాణాలు ధ్వంసమైనవారికి రూ. 25 వేలు, హెక్టారు పంటకు రూ. 25వేలు చొప్పున పరిహారం అందిస్తారు. అర్హులైన బాధితులందరికీ డబ్బులు జమచేయనున్నారు.


భారీ వర్షాలతో ఏపీ వ్యాప్తంగా 16 జిల్లాల్లో ఆస్తులు, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బుడమేరు వరదలకు విజయవాడలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. ఒక్క విజయవాడ పరిధిలోనే ముంపు బారిన పడిన బాధితులు సుమారు లక్షన్నర మంది ఉన్నారు. బాధితులకు ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను ప్రభుత్వం పంపిణి చేయనుంది. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారాలు, చిన్న తరహ పరిశ్రమలు, వాహానాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం అందించనుంది. ఎమ్యూనరేషన్‌లో మిస్సయినవారికి నిబంధనల ప్రకారం ఆర్థిక ప్యాకేజీ కూడా అందజేయనున్నారు. మొత్తానికి వరదల్లో తీవ్రంగా నష్టోయిన అందరికి బుధవారం నుంచి ప్రభుత్వ సాయం అందుతుందది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభుత్వానికి చెప్పకుండా రూ.159 కోట్లు స్వాహా..

మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు

జగన్ హయాంలోనే ఆ ప్రాజెక్టుకు నష్టం..

ఏపీ వరద బాధితులకు పరిహారం అందజేత

సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ఉచ్చు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 25 , 2024 | 12:26 PM