Congress: ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం దరఖాస్తులు సిద్ధం చేసిన కాంగ్రెస్
ABN , Publish Date - Jan 24 , 2024 | 11:15 AM
విజయవాడ: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఏపీ కాంగ్రెస్ కమిటీ దరఖాస్తులు సిద్ధం చేసింది. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. దరఖాస్తులు స్వీకరించే సమయంలో పార్టీకి ఫండ్‌గా కొంత నగదు డిపాజిట్ చేయాలని నిబంధన పెట్టింది.

నిబంధనలు..
లోక్ సభలో పోటీ చేసే జనరల్ అభ్యర్థికి రూ. 25,000..
రిజర్వుడు లోక్ సభ స్థానానికి రూ. 15,000..
జనరల్ అసెంబ్లీ స్థానానికి రూ. 10,000..
రిజర్వుడు అసెంబ్లీ స్థానానికి రూ. 5,000 డిపాజిట్ చేయాలని పేర్కొంది.
డొనేషన్ ఫర్ దేశ్ అనే లింక్‌లో డిపాజిట్ చేయాలని కాంగ్రెస్ కమిటీ సూచించింది. అప్లికేషన్‌తో పాటు డిపాజిట్ రిసిఫ్ట్‌ను కూడా సబ్‌మిట్ చేయాలని సూచింది. ఆ ఫండ్‌ను పార్టీకి డొనేషన్ ఇచ్చినట్టుగా కమిటీ పరిగణిస్తుంది. ఈ క్రమంలో మరి కాసేపట్లో మొదటి దరఖాస్తు ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాకూర్ తీసుకోనున్నారు.