Narayana: అదానికి ఇనుప కవచంలా మోదీ
ABN , Publish Date - Aug 14 , 2024 | 02:33 PM
Andhrapradesh: సెబి అదానీ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అదానికి ఇనుప కవచంలా మోదీ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. మోదీ వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి అహంభావం పెరిగిపోయిందని...
విజయవాడ, ఆగస్టు 14: సెబి అదానీ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అదానికి ఇనుప కవచంలా మోదీ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. మోదీ వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి అహంభావం పెరిగిపోయిందని... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చర్యలు చేపట్టారన్నారు. ఎవరినైతే జైల్‌లో పెట్టారో వారే బంగ్లాదేశ్‌కు ప్రధాని అయ్యారన్నారు.
Home Minister Anita: అనాగరికంగా హత్య చేశారు..
హిందువులపై దాడులు చేస్తున్న వీడియోలు పెట్టి బీజేపీ పెద్ద యెత్తున ప్రచారం చేస్తున్నారన్నారు. వయనాడ్‌లో బాధితులను ఆదుకునేందుకు సీపీఐ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జోక్యాన్ని ఖండిస్తున్నామన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్‌లో ఉన్నందున మరొకరికి వేడుకల బాధ్యతలు అప్పగించారన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని అడ్డుకోవడం సరికాదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అంశంలో మాజీ మంత్రి కొడుకును అరెస్టు చేశారని.. జోగి రమేష్ విషయం ఒకటే బయటకు వచ్చింది, ఇంకా ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయని నారాయణ అన్నారు.
రైతులపై దృష్టి పెట్టండి: రామకృష్ణ
ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విషయాలపై దృష్టి పెడుతున్నారు కానీ రైతులపై సరైన దృష్టి పెట్టడం లేదని సీపీఐ నేత కె రామకృష్ణ అన్నారు. రైతులకు పంట నష్ట పరిహారానికి సంబంధించి ప్రీమియం చెల్లించలేదన్నారు. ఖరీఫ్ పూర్తవుతున్న పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. ఇచ్చే పరిహారం సకాలంలో ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కర్నాటక ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని ప్రాజెక్టులను సందర్శించి నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Sujana chowdary: లాభనష్టాలతో సంబంధం లేకుండా వ్యవసాయం చేసేవాడే రైతు...
KA Paul: ఆ విషయంలో చంద్రబాబు కూడా బాధపడుతున్నారు
Read Latest AP News And Telugu News