AP NEWS: ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో దీపారాధన
ABN , Publish Date - Jan 22 , 2024 | 06:16 PM
రామజన్మభూమి అయోధ్యలో రామందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు.
విజయవాడ: రామజన్మభూమి అయోధ్యలో రామందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో సాయంత్రం 5 దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జై శ్రీరామ్ నినాదంతో దీపాలు వెలిగించేందుకు ప్రమిదులను సేవకులు సిద్ధం చేశారు.
రామబాణాన్ని, జై శ్రీరామ అనే మంత్రాన్ని ప్రమిదల రూపంలో సేవకులు అమర్చారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి శ్రీరాముని సంకీర్తనలు ఆలపించారు. వాడవాడల్లో ఉన్న రామాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముల వారికి పట్టాభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు, విశేష పూజలు విజయవాడ నగరవాసులు చేశారు. ఎక్కడ విన్న జై శ్రీరామ్ అనే శ్రీరాముని నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఈరోజు ఉదయం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రామభక్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం నుంచి రామాలయాలు, కృష్ణాలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి.