Share News

AP Pension: ఏపీలో వేగంగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ

ABN , Publish Date - Nov 01 , 2024 | 09:45 AM

Andhrapradesh: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. గ్రామ, సచివాలయ సిబ్బంది.. పెన్షన్‌దారుల ఇళ్లకు వెళ్లి మరీ పెన్షన్ డబ్బులను అందజేస్తున్నారు. సరిగ్గా ఒకటో తేదీనే పెన్షన్ రావడంతో పెన్షన్‌దారులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు.

AP Pension: ఏపీలో వేగంగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ
AP Pension

అమరావతి, నవంబర్ 1: ఏపీలో కూటమి ప్రభుత్వం (AP Govt) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్ (AP Pension) సరిగ్గా ఒకటో తారీఖునే పెన్షన్‌దారుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం అయితే ముందు రోజే పెన్షన్లను పంపిణీ చేస్తోంది సర్కార్. పెన్షన్‌ కోసం ఎలాంటి ఎదురుచూపులు చూడకుండానే తమ చేతుల్లోకి పెన్షన్ వచ్చేస్తుండటంతో లబ్దిదారుల ఆనందం అంతా ఇంతా కాదు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సరైన సమయానికి పెన్షన్‌ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

LPG Gas: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు


వేగంగా పెన్షన్ల పంపిణీ

నవంబర్ 1 వచ్చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వేగంగా జరుగుతోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటి వరకు 29.83 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. ఈ నెల పింఛను దారుల కోసం ప్రభుత్వం రూ.2,710 కోట్లను విడుదల చేసింది. ఈరోజే వంద శాంత పెన్షన్ పంపిణీ పూర్తి అయ్యేలా సర్కార్ ఏర్పాట్లు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ లబ్దిదారులకు పెన్షన్ డబ్బులను అందజేస్తున్నారు. సరిగ్గా ఒకటవ తేదీనే పెన్షన్ రావడంతో వృద్ధులు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


కాగా.. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెన్షన్‌ను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచింది. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేల పెన్షన్‌ను జూలై 1వ తేదీన లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసింది. పెన్షన్ పెంపుతో అదనపు భారం పడినప్పటికీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా పెన్షన్‌ను పెంచింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి రూ.4000 పింఛను ఇస్తోంది. అలాగే దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ ను రూ.3000 నుంచి ఒకేసారి రూ.6000 పెంచారు. దాంతో పాటు తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పింఛను రూ.5000 నుంచి రూ.15000లకు పెంచిన విషయం తెలిసిందే.

TG Govt: దీపావళి నాడు మరో శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం ..ఏంటంటే..


జూలై నుంచి సరిగ్గా ఒకటవ తేదీనే పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఒక్క రోజులోనే పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణినీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంది సర్కార్. గడిచిన మూడు నెలల్లో ఒకటవ తేదీనే పెన్షన్లదారుల చేతుల్లోకి డబ్బులు వచ్చేశాయి. అయితే సెప్టెంబర్‌లో మాత్రం పెన్షన్ పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు పెన్షన్లను అందజేసింది. సెప్టెంబర్ 1 ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే అంటే ఆగస్టు 31వ తేదీనే పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కాగా ఒకటో తారీఖు లేదంటే ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడంతో పింఛన్‌దారులు ఆనందంగా ఉన్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడం, ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సెలవుకు భంగం కలగకుండా, పెన్షన్‌దారులకు నగదు అందడం కోసం ఒకరోజు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

AP NEWS: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. మహిళను హత్య చేసి ఆపై...


Lokesh: అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేష్

Read latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2024 | 10:26 AM