Share News

Fire DG: వరద బాధితుల ధన్యవాదాల తీరును మా జీవితాల్లో మరిచిపోలేం

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:56 PM

Andhrapradesh: వరద ప్రాంతాలలో సర్వీస్ అందించిన అగ్నిమాపక సిబ్బందిని పైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పైర్ డీజీ మాట్లాడుతూ.. బుడమేరు ప్రవాహంలో 32 వార్డులు పది రోజుల పాటు ఉన్నాయన్నారు. ఇంతటి విపత్తు రావడం తమకు తెలిసి ఇదే తొలిసారన్నారు.

Fire DG: వరద బాధితుల ధన్యవాదాల తీరును మా జీవితాల్లో మరిచిపోలేం
AP Fire DG Pratap

విజయవాడ, సెప్టెంబర్ 13: వరద ప్రాంతాలలో సర్వీస్ అందించిన అగ్నిమాపక సిబ్బందిని పైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ (AP Fire DG madireddy Pratap) ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పైర్ డీజీ మాట్లాడుతూ.. బుడమేరు ప్రవాహంలో 32 వార్డులు పది రోజుల పాటు ఉన్నాయన్నారు. ఇంతటి విపత్తు రావడం తమకు తెలిసి ఇదే తొలిసారన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను రిస్క్యూ చేసి బయటకు తీసుకు వచ్చామని తెలిపారు.

BRS: ఆంధ్ర సెటిలర్లను కంటికి రెప్పలా చూసుకుంది కేసీఆరే.. వివాదంపై కౌశిక్ క్లారిటీ


వృద్దులు, పిల్లలు, మహిళలను ఆస్పత్రికి తరలించడంలో అగ్నిమాపక సిబ్బంది బాగా పని చేశారని కొనియాడారు. లక్షా 25వేల మందికి అవసరమైన మందులు, భోజనం అందించామన్నారు. 13వేల మందిని వరదల నుంచి బయటకు తీసుకువచ్చామన్నారు. వరద వెళ్లిన అనంతరం బురదను పూర్తిగా శుభ్రం చేసేలా పని చేశామని తెలిపారు. తమ పని తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) కూడా ప్రత్యేకంగా అభినందించారన్నారు.

Supreme Court: విచారణకు సహకరించండి.. జోగి, అవినాశ్‌కు సుప్రీం ఆదేశం


ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సీఎం సహాయ, సహకారాలు అందించారన్నారు. ప్రణాళిక బద్దంగా వెళ్లి ప్రతిరోజూ ఎనిమిది వేల ఇళ్లను శుభ్రం చేశామని తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు గండ్లు పూడ్చటంలో ఆయన చేసిన కృషిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ‘‘వరద బాధితులందరూ మా సర్వీస్‌ను చూసి మాకు ధన్యవాదాలు తెలిపిన తీరు మా జీవితాల్లో మరచిపోలేం’’ అని ఫైర్ డీజీ ప్రతాప్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

CP Anand: గణేష్‌ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు

Arekapudi Gandhi: బ్రోకర్, కోవర్టును ఊరు మీదకు వదిలారు.. కౌశిక్‌పై గాంధీ ఫైర్

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 13 , 2024 | 05:02 PM